తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు.. దేశంలో ఎన్ని రకాలో తెలుసా?

తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు.. దేశంలో ఎన్ని రకాలో తెలుసా?
x
Representational Image
Highlights

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జన్యుమార్పులను చేసుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జన్యుమార్పులను చేసుకుంటుంది. భారత దేశం విషయానికొస్తే ఈ వైరస్ ఏకంగా 198 రకాలుగా ఉన్నట్లు గుర్తించామని జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఏకంగా 55 రకాల కరోనా వైరస్‌లతో రెండో స్ధానంలో ఉంది. ఈ వైరస్ 55 రకాలుగా జన్యు మార్పులు చేసుకుంటు ప్రజలకు భయాందోళకు గురి చేస్తుంది. కొవిడ్‌-19కు చెందిన 400 జన్యువుల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది.

ప్రపంచ దేశాల నుంచి ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశించినాక లేదా అంతకంటే ముందే ఈ కరోనా వైరస్ లో 198 రకాల జన్యు మార్పులు జరిగాయని వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా వైరస్ 60 రకాల జన్యు మార్పులను చేసుకొని మొదటి స్థానంలో ఉండగా, 55 వైరస్ లతో తెలంగాణ రాష్ట్రం రెండో స్ధానంలో ఉంది. ఇక ఢిల్లీలో 39 రకాలు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల కరోనాలు ఉన్నట్లు తెలిపింది. ఇరాన్‌, దుబాయ్‌ దేశాల నుంచి వ్యాపిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లో చాలా తక్కువగా ఉందని చెప్పారు. చైనా, యూరప్ నుంచి వ్యాపించిన రెండు రకాల కరోనా వైరస్‌ల వల్లే దేశంలో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories