యాదాద్రిలో రాజకీయ వివాదానికి దిద్దుబాటు చర్యలు

యాదాద్రిలో రాజకీయ వివాదానికి దిద్దుబాటు చర్యలు
x
Highlights

యాదాద్రి ఆలయ శిల్పాలపై చిత్రాల వివాదం సమసిపోయింది. యాదాద్రి అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్ తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని...

యాదాద్రి ఆలయ శిల్పాలపై చిత్రాల వివాదం సమసిపోయింది. యాదాద్రి అష్టభుజి ప్రాకారంలో ఉన్న స్తంభాలపై కేసీఆర్ తో పాటు ఎలాంటి రాజకీయ చిత్రాలు ఉంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా భారీ ఎత్తున శిల్పాలను చెక్కుతున్నారు. ఆలయం బయట ఏర్పాటు చేసిన అష్టభుజి బాహ్య ప్రకారంలో కేసీఆర్, కేసీఆర్ కిట్ టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును స్తంబాలపై చెక్కించారు. ఇవి రాజకీయంగా దుమారం రేపింది. ఆధ్యాత్మిక వర్గాలు, రాజకీయ పార్టీలు, హిందుత్వ సంస్థలతో పాటు సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

యాదాద్రిలో చిత్రాలపై విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దైవ సంబంధిత చిహ్నాలే తప్ప ఇతర చిత్రాలు ఉండటానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఆదేశించింది. అష్టభు జి ప్రాకార మండపాలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, కారు, ప్రభుత్వ పథకాలతో పాటు స్తంభాలపై చెక్కిన అన్ని రకాల బొమ్మలను తొలగించారు. సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం అంశాలను నిక్షిప్తం చేసే చిత్రాలు మాత్రమే ఉండే విధంగా శిల్పాలు చెక్కడం మొదలు పెట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories