కాశ్మీర్ టు కన్యాకుమారి వయా నల్గొండ... ఓ యువకుడి సైకిల్ యాత్ర

కాశ్మీర్ టు కన్యాకుమారి వయా నల్గొండ... ఓ యువకుడి సైకిల్ యాత్ర
x
Highlights

తమకు ఎంతో నచ్చిన నాయకులు పదవిలోకి వస్తే దేవునికి కొబ్బరికాయలు కొడతారు, లేదా పేదవారికి అన్నదానం చేయిస్తారు. లేదా తమకు నచ్చిన రీతిలో పేదలకు సాయం చేస్తారు.

తమకు ఎంతో నచ్చిన నాయకులు పదవిలోకి వస్తే దేవునికి కొబ్బరికాయలు కొడతారు, లేదా పేదవారికి అన్నదానం చేయిస్తారు. లేదా తమకు నచ్చిన రీతిలో పేదలకు సాయం చేస్తారు. కానీ ఓ యువకుడు మాత్రం తనకు నచ్చిన నాయకుడు సీఎం అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తానని శపథం చేసాడు. అన్నట్టుగానే తన ఇష్టనాయకుడు సీఎం కావడంతో సైకిల్ యాత్రను ప్రారంభించి సగం కన్నా ఎక్కువ దూరమే ప్రయాణించాడు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అతిన యాత్ర మధ్యలోనే ఆగిపోయింది. అయినా ఆ యువకుడు వెనకడుగు వేయకుండా లాక్ డౌన్ ముగిసిన తరువాత తన యాత్రను కొనసాగిస్తానంటూ చెపుతున్నాడు. అసలు ఆ యువకుడు ఎవరు, అతను మెచ్చిన నాయకుడు ఎవరో ఇప్పుడు చూద్దాం.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాకినాడ సమీపంలోని మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్‌ కు సీఎం వైస్ జగన్ అంటే ఎంతో ఇష్టం. వృత్తిరీత్యా పేయింటెంగ్‌ చేస్తుకునే అతను ఇటీవలే కువైట్‌ వెళ్లి వచ్చాడు. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ముందు అంటే 2018లో రమేశ్ గ్రామంలో ఓ శపథం చేసాడు. వైఎస్ జగన్ సీఎం అయితే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేస్తానని చెప్పాడు. అతను అనుకున్నట్టుగాను జగన్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడంతో ఫిబ్రవరి 20వ తేదీన కశ్మీర్‌ నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించాడు.

32రోజులు కొనసాగిన యాత్రలో ఆ యువకుడు 3,700 కిలోమీటర్లు ప్రయాణించాడు. కాగా మార్చి 22వ తేదీన రమేశ్ నల్లగొండకు చేరుకున్నాడు. రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుండడంతో అతన్ని నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ ఆపగా సైకిల్ స్టేషన్‌లో ఉంచి హైదరాబాద్‌ వెళ్లాడు. లాక్ డౌన్ ఇంకా కొనసాగుతుందని తెలియడంతో బుధవారం నల్లగొండకు వచ్చి తన సైకిల్‌ తీసుకొని తన స్వగ్రామం మాధవపట్నం బయల్దేరి వెళ్లాడు. లాక్ డౌన్ పూర్తయిన తరువాత ఆపిన చోటినుంచే లాక్ డౌన్ కొనసాగిస్తానని పడాల రమేశ్ తెలిపాడు.

శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు తన సైకిల్‌యాత్రను ప్రారంభించారని, పెద్దాపురం నియోజకవర్గ నాయకులు దాలూరి దొరబాబు, మేడిశెట్టి వీరభద్రం ఈ సైకిల్‌ యాత్రకు సహకరిస్తున్నారని తెలిపాడు. ఈ విధంగా అనుకన్న పనిని చేయడం ఎంతో ఆనందంగా ఉందని రమేశ్ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories