టిక్‌టాక్‌కు దాసోహం అవుతున్న యూత్‌ ... సరదాగా మారిన టిక్‌టాక్‌ వ్యసనం

టిక్‌టాక్‌కు దాసోహం అవుతున్న యూత్‌ ... సరదాగా మారిన టిక్‌టాక్‌ వ్యసనం
x
Highlights

మొన్న ఖమ్మం, నిన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి, ఇవాళ విశాఖ, కరీంనగర్‌. తెలుగు ప్రజలు ఇప్పుడు టిక్‌ టాక్‌ మోజులో పడ్డారు. ఓ వైపు ప్రాణాల మీదికి...

మొన్న ఖమ్మం, నిన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి, ఇవాళ విశాఖ, కరీంనగర్‌. తెలుగు ప్రజలు ఇప్పుడు టిక్‌ టాక్‌ మోజులో పడ్డారు. ఓ వైపు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా.. ఉద్యోగాలు పోతున్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సరదాగా వీడియోలు చేసి.. టిక్‌ టాక్‌లో పెట్టి.. కెరీర్‌తో సహా లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తున్నారు. ఎవరెంత వారిస్తున్నా.. యూత్‌ హార్ట్‌ ఎందుకు టిక్‌ టాక్‌ అంటోంది..?

టిక్‌ టాక్‌.. చైనాకు చెందిన ఈ షార్ట్‌ వీడియో మెస్సెజ్‌ యాప్‌కు.. మన యూత్‌ దాసోహం అంటోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఈ యాప్‌లో వీడియోలు పెట్టడం.. తమ టాలెంట్‌ను చూపించుకోవడం సరదాగా మారిపోయింది. ఈ వ్యసనం కాస్తా.. యూత్‌ నుంచి ఎంప్లాయిస్‌కు షిఫ్ట్‌ అయ్యింది. శనివారం టిక్‌టాక్‌కు దాసోహం అవుతున్న యూత్‌ ... సరదాగా మారిన టిక్‌టాక్‌ వ్యసనం మహిళా ఉద్యోగులు టిక్‌ టిక్‌ వీడియో చేశారు.

ఓ తెలుగు పాటకు వీరు చేసిన వీడియో కాస్త.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు వీరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ తర్వాత సీనియర్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు విశాఖలోనూ శక్తి టీమ్‌ ఉద్యోగులు చేసిన టిక్‌ టాక్ వీడియో తీవ్ర విమర్శలకు దారి తీసింది. పోలీస్‌ వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఇద్దరు మహిళలు.. మూవీ డైలాగ్స్‌, రియాల్టీ షో జోక్స్‌ పై టిక్ టాక్ వీడియోలు తీశారు. జబర్దస్త్‌ పంచ్‌లను ఇమిటేట్‌ చేస్తూ.. లేడీ కానిస్టేబుల్స్‌ చేసిన వీడియోలు.. తెగ వైరల్‌ అవుతున్నాయి.

విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు.. ఇలా వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పని వదిలేసి.. అదేపనిగా టిక్‌ టాక్‌ పిచ్చిలో పడుతున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్‌లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేసిన వీడియోలతో.. వారిపై వేటు పడింది. విధులు నిర్వహించకుండా, టిక్‌టాక్‌ చేస్తూ.. 9 మంది ఉద్యోగులు మీడియాకు చిక్కడంతో.. ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు ఫిజియోథెరపీ ఇంటర్న్‌ షిప్ విద్యార్థులు తీసిన టిక్‌ టాక్‌ వీడియోపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌ హెడ్‌కు నోటీసులు పంపారు. రాత్రికి రాత్రి సెలబ్రిటీలు కావడం కోసమో.. లేక తమకున్న టాలెంట్‌ను ప్రదర్శించడం కోసమో.. ఏదేమైనా టిక్ టాక్‌ వీడియోల పేరుతో.. ఉద్యోగాలతో పాటు.. జీవితాలను ప్రమాదంలో పడేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories