కారుతో ఆర్టీసీ బస్సు ఢీ.. ఆపై..

కారుతో ఆర్టీసీ బస్సు ఢీ.. ఆపై..
x
Highlights

కారును డ్రైవ్ చేస్తూ రాంగ్‌రూటులో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే కాదు తిరిగి ఆర్టీసీ డ్రైవర్‌పైనే యువకులు దాడికి దిగిన ఘటన కరీంనగర్‌లో జరిగింది....

కారును డ్రైవ్ చేస్తూ రాంగ్‌రూటులో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే కాదు తిరిగి ఆర్టీసీ డ్రైవర్‌పైనే యువకులు దాడికి దిగిన ఘటన కరీంనగర్‌లో జరిగింది. స్థానిక యువకులు ఆదివారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్నాడు. కరీంనగర్ కమాన్ దగ్గరకు రాగానే కారును రాంగ్‌రూట్‌లో మితిమీరిన వేగంతో నడిపాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు.

కారును రాంగ్ రూటులో నడపడమే కాకుండా ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన యువకుడు ఆగ్రహంతో కారు దిగి బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌పై దాడి చేశాడు. బస్సులోకి వెళ్లి డ్రైవర్‌ను కిందికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు, ప్రయాణికులు అతడిని అడ్డుకోవడంతో తోకముడిచాడు. ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories