ఔషధమే ఆహారంగా మారుతుంది: మంత్రి హరీశ్ రావు

ఔషధమే ఆహారంగా మారుతుంది: మంత్రి హరీశ్ రావు
x
హరీష్ రావు (ఫైల్ ఫోటో)
Highlights

యోగ చేయడం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మంది ఆరోగ్యం కుదుటపడిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

యోగ చేయడం ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మంది ఆరోగ్యం కుదుటపడిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో యోగా శిబిరాన్ని ఆయన ఈ రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మనిషి సాధారణంగా నిమిషానికి 20 నుంచి 25 సార్లు శ్వాస తీసుకుంటారని తెలిపారు.

అదే యోగాలో ప్రాణాయామం విద్యలో ప్రావీన్యం పొందిన వారు 12 నుంచి 15 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారని అన్నారు. అదేవిధంగా ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏళ్లు బతుకుతుందని, తాబేలు నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని 300 నుంచి 400 ఏళ్లు జీవిస్తుందని తెలిపారు. అదే విధంగా రోజుకు ఎక్కవసార్లు శ్వాస తీసుకునే కుక్క కేవలం 15 ఏళ్ల కన్నా ఎక్కువ బతకదని తెలిపారు.

ఇక పోతే ప్రాణాయామం చేయడం ద్వారా తక్కువ సార్లు శ్వాస తీసుకోవడం వలన యోగా నేర్చకునే వారు వందేళ్లు జీవిస్తారని ఆయన స్పష్టం చేసారు. దీని వలన గాలిలోని ఆక్సిజన్‌ ఆహారంగా మారి వ్యక్తిలోని ఆకలిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గంట ప్రాణాయామం చేస్తే డాక్టర్‌ ల అవసరం లేకుండా పోతుందని ఆయన అన్నారు. సోషల్‌ మీడియా, టీవీ కోసం ఎక్కువ సమయం కేటాయించడం కంటే యోగ నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

ప్రస్తుతం చాలా పాఠశాలలు పిల్లల్ని మార్కులు, ర్యాంకులు అంటూ మిషన్లగా తయారు చేస్తున్నాయని అన్నారు. పిల్లలకు చదువుతో పాటు యోగా తప్పనిసరి నేర్పించాలని దీంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలిపారు. కష్టం వచ్చినా తట్టుకునేలా తయారు చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో చేయిదాటక ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహారం మితంగా తినాలి. ఆహారమే ఔషదంగా తీసుకోవాలి. లేదంటే ఔషదమే ఆహారంగా మారుతుందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories