సమ్మక్క కరుణించింది..కుక్క దొరికింది..!

సమ్మక్క కరుణించింది..కుక్క దొరికింది..!
x
సమ్మక్క కరుణించింది..కుక్క దొరికింది..!
Highlights

సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతున్న వేళా అంతా కుటుంబంతో వెళ్తున్నారు, ఇంట్లో పిల్లల బరువు లేదా తమ బరువుతో బెల్లంను కొలిచి బంగారంలా ఇస్తుంటారు, అయితే...

సమ్మక్క సారాలమ్మ జాతర జరుగుతున్న వేళా అంతా కుటుంబంతో వెళ్తున్నారు, ఇంట్లో పిల్లల బరువు లేదా తమ బరువుతో బెల్లంను కొలిచి బంగారంలా ఇస్తుంటారు, అయితే ఇక్కడ ఓ కుటుంబం మాత్రం ఏ కుటుంబంలో ఎవరూ చేయని పని చేసేది అదేంటో మీరు చూడండి.

ఈ దంపతులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వారు గోదావరిఖని పట్టణం ఐబీ కాలనీకి చెందిన వెంకటేశ్వరావు సింగరేణి కార్మికుడు, గత కొంతకాలం నుంచి తన ఇంట్లో గొల్డెన్‌‌ లిట్‌‌ లివర్‌‌ అనే జాతికి చెందిన కుక్కను పెంచుతున్నాడు. దానిని అల్లారు ముద్దుగా పెంచుకోవటంతోపాటు దానికి జెర్సీ అనే పేరు కూడా పెట్టుకున్నారు. సరదాగా అందరితోపాటు పెరిగిన ఆ కుక్క గత రెండు మాసాల క్రితం కనిపించకుండాపోయింది. దీంతో హైరానా చెందిన కుటుంబసభ్యులు తమ ఇష్టదైవం అయిన సమ్మక్కకు మొక్కుకోవటంతో తిరిగి మూడు రోజుల్లో తమ జెర్సీ ఇంటికి చెరింది.

అమ్మవారి దయవల్ల జెర్సీ ఇంటికి చేరిందన్న నమ్మకంతో దానికి కిరాణా దుకాణంలో తూకం వేయించి, దాని బరువుకు సరిపడా బంగారం తీసుకుని మేడారం జాతరకు వెళ్లి మొక్కు తీర్చుకుంది ఆ కుటుంబం. ఎవరైనా తమకు ఐశ్వర్యం కలగాలని, సంతానం కలుగాలని, ఇంకా ఎన్నో రకాల కోరికలు కోరుకుంటారు, ఇక్కడ మాత్రం విభిన్నంగా జరిగింది. తాము పెంచుకున్న ఓ మూగజీవి కనిపించకపోతే దానికోసం ఆ కుటుంబం పడిన బాధ మానవత్వాన్ని మరోసారి గుర్తుకు చేసింది. ఇంట్లోని కుటుంబసభ్యులతో పాటే కలివిడిగా పెరిగిన కుక్క ఒక్కసారిగా కనపడకపోవటంతో ఆవేదనకు గురయ్యారు.

ఏళ్ల తరబడి తమతో ఉన్న శునకం అదృశ్యం కావటంతో కుటుంబసభ్యుల్లో ఏదో తీరని లోటు ఏర్పడింది, దీంతో తమ ఇంటి ఇలవేల్పు అయిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కుకున్నారు. తమ కుక్క తిరిగివస్తే దాని బరువంత బంగారం(బెల్లం) ను అమ్మవార్లకు సమర్పించుకుంటానని మొక్కుకున్నారు ఇంకేముందు మూడు రోజుల్లో తిరిగి ఇంటికి చేరటంతో వారింట్లో ఆనందం పొంగి పొర్లింది. చకచకా తమ పెంపుడు కుక్కను కిరాణా దుకాణానికి తీసుకువెళ్లి తూకం వేసి బెల్లం కొని, మేడారం వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories