అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌
x
Highlights

ప్రసిద్ద ఇ-కామర్స్ కంపెనీ అమేజాన్ ప్రపంచంలో తమ అతి పెద్ద క్యాంపస్ ను బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీనిని తెలంగాణ రాష్ర్ట హోం మంత్రి మహమూద్ ఆలీ , ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ లు లాంచనంగా ప్రారంభించారు.

ప్రసిద్ద ఇ-కామర్స్ కంపెనీ అమేజాన్ ప్రపంచంలో తమ అతి పెద్ద క్యాంపస్ ను బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీనిని తెలంగాణ రాష్ర్ట హోం మంత్రి మహమూద్ ఆలీ , ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ లు లాంచనంగా ప్రారంభించారు. ఏక కాలంలో 15 వేల మంది పనిచేయగల ఈ క్యాంపస్ లో ప్రస్తుతం 4 వేల 500 మంది పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇ-కామర్స్ కంపెనీ అమేజాన్ తమ అతి పెద్ద సెంటర్ ను ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభించింది. 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వున్న ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని కేవలం మూడు సంవత్సరాల్లో కంపెనీ పూర్తి చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ బిల్డింగ్ కు అప్పటి ఐటి శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ బిల్డింగ్ కు కావల్సిన అన్ని అనుమతులను కేవలం 11 రోజులలోనే ఇచ్చామని రాష్ట్ర ఐటి శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. అమేజాన్ కంపెనీ కి చెందిన అతి పెద్ద సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం హర్షనీయమని , అమేజాన్ కు సంబంధించిన మిగతా వ్యాపారాల విస్తరణ కేంద్రాలను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ కోరారు.

దాదాపు పది ఎకారాల్లో ఏర్పాటు చేసిన ఈ అమేజాన్ సెంటర్ లో ఏక కాలంలో 15 వేల మంది పనిచేసే అవకాశం వుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇందులో 4 వేల 500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా , రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులు మిగతా క్యాంపస్ ల నుండి ఈ బిల్డింగ్ కు మారతారని కంపనీ తెలిపింది. ప్రస్తుతం భారత్ లో మొత్తం 62 వేల మంది ఉద్యోగులు అమేజాన్ కంపెనీలో పనిచేస్తుండగా, ఇందులో దాదాపు 20 వేల మంది హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారని కంపెనీ ఇండియా హెడ్ అమిత్ తెలిపారు. అమెరికా తర్వాత ఎక్కువ ఉద్యోగులున్న దేశం భారతే అని ఆయన చెబుతున్నారు.

ఈ బిల్డింగ్ పది ఎకరాల్లో ఏర్పాటు చేసినా , నిర్మితమైన ఏరియా పరిచినట్లయితే అది 68 ఎకరాలు , లేదా 65 ఫుట్ బాల్ గ్రౌండ్స్ కి సమానంగా వుంటుందని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్ లో ఈఫిల్ టవర్ లో వాడిన స్టీల్ కంటే 2.5 రెట్లు ఎక్కువ స్టీల్ వాడారు. ఈ నిర్మాణంలో మొత్తం 49 లిఫ్ట్ లు వుండగా , సెకన్ కు ఒక ఫ్లోర్ కు వెళ్లే సామర్థంతో ఇవి పనిచేస్తున్నాయి.ఏక కాలంలో 972 మందిని తీసుకెళ్లే కెపాసిటీతో ఈ ఎలివేటర్లను ఏర్పాటుచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories