విద్యార్థిని గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణం.. సంచలన నిజాలు వెలుగులోకి

విద్యార్థిని గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణం.. సంచలన నిజాలు వెలుగులోకి
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీమ్ జిల్లాలోని గిరిజన మహిళ రెసిడెన్సియల్ కళాశాలలో దారుణం జరిగింది. వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న ముగ్గరు విద్యార్థినిలు గర్భం...

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీమ్ జిల్లాలోని గిరిజన మహిళ రెసిడెన్సియల్ కళాశాలలో దారుణం జరిగింది. వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న ముగ్గరు విద్యార్థినిలు గర్భం దాల్చిన ఘటన కలకలం సృష్టించింది. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెంటల్‌ డిగ్రీ కాలేజీ వసతి గృహానికి చెందిన పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్‌ సిబ్బంది వారిని రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌ పాజిటీవ్‌ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. మిగిలిన వారికి నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.

ఈ విషయంపై మీడియాలో వార్తుల వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనపై విచారణ జరిపిన పోలీసులు ప్రేమ వ్యవహారమే విద్యార్థిని గర్భానికి కారణమని స్పష్టం చేసారు. పోలీసులతో పాటు విచారణలో ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్‌ పీడీ సావిత్రి ఉన్నారు. వీరందరి సమక్షంలోనే విద్యార్థి గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె ఒప్పుకుంది.

ఇదిలా ఉంటే ఈ విషయం గురించి మీడియాలో విస్తృతంగా ప్రచార చేయడంతో ఆ కళాశాల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తమ ప్రిన్సిపల్ పాత్ర ఏమీ లేదని, తమ కళాశాలకు చెడుపేరు వచ్చేలా మీడియాలో ప్రచారం చేశారని విద్యార్థినులు వసతిగృహం ముందు ధర్నాకు దిగారు. దీంతో ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories