Top
logo

ఖమ్మంలో కలకలం రేపుతున్న పాప మిస్సింగ్‌.. పాపకు పాలు ఇస్తానని నమ్మించి..

ఖమ్మంలో కలకలం రేపుతున్న పాప మిస్సింగ్‌.. పాపకు పాలు ఇస్తానని నమ్మించి..
X
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి
Highlights

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపాప మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం నుండి 15...

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపాప మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం నుండి 15 రోజుల పాప అదృశ్యమైంది.

వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి తన 15 రోజుల పసికందుతో హాస్పిటల్‌కు వచ్చింది. ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ పాపకు పాలు ఇస్తానని నమ్మబలికి ఆ పసికందును అపహరించింది. పాపను అపహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Web Titlewoman kidnap infant from khammam government hospital
Next Story