నా బాయ్ ఫ్రెండ్‌‌ను తెచ్చియ్యండి.. పోలీస్‌స్టేషన్‌లో యువతి హల్‌చల్

నా బాయ్ ఫ్రెండ్‌‌ను తెచ్చియ్యండి.. పోలీస్‌స్టేషన్‌లో యువతి హల్‌చల్
x
బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌
Highlights

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. తన ప్రియుడిని తీసుకురావాలని లేదంటే పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటానని...

హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. తన ప్రియుడిని తీసుకురావాలని లేదంటే పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి (22)కి మాదాపూర్‌లోని ఓ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పెళ్లయిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సదరు వ్యక్తి యువతికి కన్ఫించకుండా పోయాడు. దీంతో బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లో నివాసముండే ప్రియుడి ఇంటికి బుధవారం రాత్రి వచ్చింది.

ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తనకు వివాహం జరిపించాలంటూ వారితో వాదనకు దిగింది. దీంతో వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సదరు యువతితో పాటుగా ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పీఎస్‌కు తీసుకోచ్చి విచారించారు. ఈ క్రమంలో సదరు యువతి పీఎస్‌లో హల్‌చల్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుడా అరుస్తూ. తన బాయ్‌ఫ్రెండ్‌ను తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేసింది. తలను గోడకు బాదుకుని ఏడ్చింది. చివరకు అతన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పడంతో ఆమె శాంతించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories