Top
logo

భర్తను హత్యచేశానంటూ పోలీస్ స్టేషన్ వెళ్లిన భార్య..అక్కడేమైందో తెలుసా..

భర్తను హత్యచేశానంటూ పోలీస్ స్టేషన్ వెళ్లిన భార్య..అక్కడేమైందో తెలుసా..
X
Highlights

ఈ మధ్య కాలంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకోవడం లాంటి క్రైం సంఘటను ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి.

ఈ మధ్య కాలంలో భర్తను భార్య, భార్యను భర్త చంపుకోవడం లాంటి క్రైం సంఘటను ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోజుకు సగటున 10సంఖ్యకు పైగానే ఇలాంటి క్రైం కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజు ఇలాంటి వార్తలను వినే ఓ గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఓ మహిళ భర్త కనిపించకుండా పోవడంతో భార్యే భర్తను హత్య చేసిందని అనుమానించారు. భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిందంటూ పుకార్లు షికార్లు చేయటంతో కారేపల్లిలో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. బాధిత మహిళ ప్రవర్తన, నడవడిక, మాటతీరే ప్రజలకు అనుమానం కలిగేలా చేసింది. దీంతో గ్రామస్థులు ఆ మహిళను పోలీసులకు అప్పగించారు.

పూర్తివివరాల్లోకెళ్తే ఖమ్మం కారేపల్లి మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన ఓ మహిళ మద్యం సేవించి ఆ మత్తులో గురువారం రాత్రి కారేపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అలా వెళ్లిన మహిళను ఏమైందని ప్రశ్నించగా ఆ మహిళకు, ఆమె భర్తకు గొడవ జరిగిందని, దీంతో ఆమె తన భర్తను హత్య చేశానని తెలిపింది. అంతే కాదు తనను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. ఆమె మానసిక పరిస్థితిని గమనించిన పోలీసులు ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంది. దీంతో పోలీసులు వెంటనే ఆమె గ్రామ పెద్దమనుషులకు సమాచారం అందించారు. దీంతో గ్రామ పెద్దకు అక్కడికి చేరుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

ఇక్కడి వరకు బాగానే ఉన్న కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. గురువారం రాత్రి బయటికి వెళ్లిన మహిళ భర్త శుక్రవారం ఉదయం 10 గంటలైన ఇంటికి రాకపోవటంతో గ్రామస్తులకు అనుమానం మొదలైంది. రాత్రి మహిళ చెప్పిందంతా నిజమే కావొచ్చిన నమ్మేసారు. ఆ తరువాత మహిళను ప్రశ్నిస్తూ ఆటోలో మండలంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. అయిన మహిళ భర్త ఆచూకీ తెలియకపోవడంతో గ్రామస్థుల అనుమానం బలపడిపోయింది. కారేపల్లి బస్టాండ్‌ సెంటర్, సినిమాహాల్‌ సెంటర్‌లో 'భర్తను భార్య చంపేసింది' అనే వార్త చకర్లు కొట్టింది. అసలు ఏం జరిగింది చెప్పాలంటూ గ్రామ పెద్దలు, ప్రజలు ఆమెను చుట్టుముట్టి పలు ప్రశ్నలతో విసిగించారు. అక్కడ జనం వందలాదిగా గుమిగూడటంతో ఆమెను స్థానిక పోలీసులు కారేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అనంతరం కారేపల్లి పోలీసులకు ఆ మహిళను విచారించగా అసలు నిజం అప్పుడు బయటపెట్టింది. గురువారం రాత్రి తనకు, తన భర్తలు గొడవ జరిగిందని, ఆమె భర్త అలిగి బయటికి వెల్లాడని తెలిపింది. ప్రస్తుతం అతను మేకలతండా ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉన్నాడని స్థానికుల ద్వారా సమాచారం అందుకోవటంతో ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆమె తన భర్తను చంపలేదని, అన్ని పుకార్లేనని పోలీసులు తెలిపారు. దీంతో కథ సుఖాంతం అయింది.

Web Titlewoman halchal in karepalli police station
Next Story