Top
logo

బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా తెలంగాణ విమోచనదినం జరుపుతాం : లక్ష్మణ్‌

బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా తెలంగాణ విమోచనదినం జరుపుతాం : లక్ష్మణ్‌
Highlights

బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు.

బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా తెలంగాణ విమోచనదినం జరుపుతామని స్పష్టం చేశారు. మజ్లిస్‌ అజెండాను కేసీఆర్‌ అమలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని, తెలంగాణలో రాచరిక వ్యవస్థను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, బీజేపీ నేతలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి పలువురు హాజరయ్యారు.

Next Story