తాతయ్య ఆఖరి కోరికను నెరవేరుస్తాడా?

తాతయ్య ఆఖరి కోరికను నెరవేరుస్తాడా?
x
తాతయ్య ఆఖరి కోరికను నెరవేరుస్తాడా?
Highlights

బుడిబుడి అడుగుల ఓ బుజ్జాయి. ముసిముసి నవ్వుల ఓ పాపాయి. యుద్ధానికి మధ్య ఇప్పుడు సంధిగా కనపడుతున్నాడు. పగాప్రతీకారాల సమరంలో శాంతి కపోతంలా...

బుడిబుడి అడుగుల ఓ బుజ్జాయి. ముసిముసి నవ్వుల ఓ పాపాయి. యుద్ధానికి మధ్య ఇప్పుడు సంధిగా కనపడుతున్నాడు. పగాప్రతీకారాల సమరంలో శాంతి కపోతంలా ఎదురొస్తున్నాడు. విచ్చిన్నమైన రెండు కుటుంబాల కలయికకు వారధిగా నవ్వుతున్నాడు. ప్రణయ్‌-అమృతల గారాల బుజ్జాయి, అమ్మను, అమ్మమ్మనూ కలుపే తారకమంత్రమవుతాడా? పసివాని నవ్వులను చూసైనా, తల్లీ బిడ్డ ఒక్కటవుతారా?

కడుపులో నలుసుగా వున్నప్పుడు ఏం జరిగిందో తెలీదు. తాను గర్భంలో వున్నప్పుడు, తన ఆరోగ్యం ఎలా వుందో, ఎలా ఎదుగుతున్నానో తెలుసుకోవడానికి అమ్మానాన్న ఆస్పత్రికి వచ్చినప్పుడు, ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఓ దుర్మార్గుడి వేట కొడవలికి తన తండ్రి బలయ్యాడన్నది కడుపులో నలుసగా వున్నప్పుడు తెలీదు. కానీ నేడు అమ్మ ఒడిలో వుండి అలా చూస్తున్నాడు. నవ్వుతున్నాడు.

పాపం పుణ్యం ప్రపంచ మార్గం, ఏమీ తెలియని పువ్వుల్లారా అని శ్రీశ్రీ అన్నట్టుగా, రెండు దారుణమైన సంఘటనలు తెలుగు రాష్ట్రాన్ని ఎలా కుదిపేశాయో తన తల్లి ఎంతగా వేదన అనుభవిస్తుందో తెలియని ఈ బుజ్జి పాపాయి చూస్తున్నాడు. నవ్వుతూనే వున్నాడు. అమృత ఒడిలో వున్న ఈ బుజ్జాయే, ఇప్పుడు భవిష్యత్‌ ఆశాకిరణం. ప్రాణంకంటే మిన్నగా ప్రేమించిన భర్త, కళ్లెదుటే వేట కొడవలికి బలైనా, అంత ధైర్యంగా పోరాడిందంటే, కడుపులో ఈ నలుసు వుందనే. చిన్న వయసులోనూ మొక్కవోని దీక్షతో జీవిత పయనాన్ని సాగిస్తోందంటే, ఈ పాపాయి చిరునవ్వులే ఆశాకిరణం.

'తల్లీ అమృతా.. అమ్మ దగ్గరికెళ్లిపో...అంటూ మారుతీరావు ఆఖరి కోరికకూ, ఈ బుజ్జాయే వారధి కావాలని కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల జనం. యుద్ధానికి మధ్య సంధి ఈ చిన్నారేనంటున్నారు. నాన్న, తాతయ్యలు చనిపోయి ఒంటరిగా మిగిలిన అమ్మ-అమ్మమ్మలను కలిపేది ఈ పాపాయేనని భావిస్తున్నారు.

తాతయ్యలేని లోటు మనవడిగా తీర్చాలి. నాన్నలేని లోటు కొడుకుగా అమ్మకు తీర్చాలి. అందుకు ఈ బుజ్జాయి వారధి కావాలని కోరుకుంటున్నారు. మరి తన చుట్టూ ఏం జరుగుతుందో, ఇంత అలజడికి కారణమేంటో ఏమీ తెలియని ఈ బుజ్జాయి, పెరుగుతూ పెరుగుతూ నాన్నను చంపినవారి పట్ల పగలు పెంచుకుంటాడా లేదంటే ఇలాంటి కల్మషంలేని పాపాయిలాగే అమ్మను, అమ్మమ్మనూ సంతోషపెట్టే వారసుడు అవుతాడా అన్నది, కాలమే సమాధానం చెప్పాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories