తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు
x
Representational Image
Highlights

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి....

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. భానుడి భగభగలకు ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 46.5 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ఉంకూరులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉదయం 9 గంటలకే ఎండలు భగభగమంటున్నాయి. పగటిపూటనే ఉక్కపోత తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ వేడిమి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తర ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న వేడిగాలులు, పొడి వాతావరణం కారణంగా రాగల మూడు రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories