రెవెన్యూ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి : కేసీఆర్

రెవెన్యూ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి : కేసీఆర్
x
Highlights

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తెరాస విజయదుందుభి మోగించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్...

తెలంగాణలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తెరాస విజయదుందుభి మోగించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ.. MRO ఆఫీసుల్లో అధికారులపై పెట్రోల్ పోసే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. అవినీతిలో రెవెన్యూ శాఖా ప్రధమ స్థానంలో ఉందని ఎందుకు మొదటి స్థానంలో ఉన్నామో అధికారులు ఆలోచించాలని అన్నారు.

అంతులేని పైసలను ఎం చేసుకుంటారో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. రెవిన్యూశాఖలో విచ్చలవిడితనం, అరాచకత్వం పోవాలంటే సర్జరీ అవసరం. ఇది మందులతో పోయే పరిస్థితి లేదు. ఎవరు ఏమనుకున్నా మేం బాధపడం. ప్రజల కోసంఏమైనా చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories