హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న నీటికష్టాలు

హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న నీటికష్టాలు
x
Highlights

హైదరాబాద్‌ నగరవాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాంనగర్ ప్రాంతంలో నీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి...

హైదరాబాద్‌ నగరవాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాంనగర్ ప్రాంతంలో నీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో రోజువారీ అవసరాలకు చుక్కనీరు లేకపోవడంతో ట్యాంకర్లు రప్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నీటికష్టాల కారణంగా అక్కడ అద్దెకు ఉంటున్నవారంతా ఇళ్లు ఖాళీ చేస్తుండటంతో ఎక్కడ చూసిన టూ లేట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంటి యజమానులు లబోదిబోమంటున్నారు.

వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రాంనగర్‌ ఏరియాలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. చుక్క నీరులేక జనం అల్లాడిపోతున్నారు. నిత్యం వందల రూపాయల వ్యయంతో ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది.

ఓ వైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోగా మరోవైపు నల్లా నీళ్లు సరిగ్గా రాకపోవడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో గృహిణులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా నీరులేక ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య గురించి ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఆ ప్రాంతంలో నీటి కష్టాలు అంతలోనే యజమానులు ఇంటి అద్దెలు పెంచేయడంతో జనమంతా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు. వేరే ప్రాంతాలకు తరలిపోతుండటంతో ఎక్కడ చూసినా టూ లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి అధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories