యాదాద్రి జిల్లాలో పొంగిపొర్లుతున్న బిక్కేరు వాగు

యాదాద్రి జిల్లాలో పొంగిపొర్లుతున్న బిక్కేరు వాగు
x
Highlights

♦ ప్రవాహం చూసేందుకు వచ్చి కొట్టుకుపోయిన యువకుడు ♦ చెట్టును పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న యువకుడు ♦ తాడు సహాయంతో యువకుడిని బయటకు లాగిన స్థానికులు

బిక్కేరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఓ చెట్టు కాపాడింది. ఎగువ కురుస్తున్న వర్షాలతో యాదాద్రి జిల్లా బిక్కేరు వాగు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వాగు దగ్గరకు చేరుకున్నారు. సరదాగా ప్రవాహాన్ని చూస్తున్న ఓ యువకుడు వాగులోకి దిగాడు. వరద ఉధృతికి వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయాడు.

అదృష్టవశాత్తు ఓ చెట్టు కనిపించడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు. యువకుడు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై తాడు సాయంతో బయటకు లాగారు. క్షేమంగా యువకుడు బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories