Top
logo

హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు బంద్

హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు బంద్
Highlights

ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంచేత రేపు పలు ప్రాంతాలకు గోదావరి నీరు సరఫరా బంద్ కానుంది.

ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్‌లైన్‌ జంక్షన్‌ పనుల కారణంచేత రేపు పలు ప్రాంతాలకు గోదావరి నీరు సరఫరా బంద్ కానుంది. రేపు ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి(శుక్రవారం) ఉదయం 6గంటల వరకు నీటి సరఫరా ఆపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. పనులు పూర్తయిన తరువాత నీటి సరఫరా చేస్తామని జలమండలి పేర్కొంది. నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలివీ - హకీంపేట్, సింగాయిపల్లి, దేవరయాంజల్, తూంకుంట, పోతాయిపల్లి, చెర్లపల్లి, తుర్కపల్లి, అహ్మద్‌గూడ, మెస్‌ త్రిశూల్, గన్‌రాక్, కంటోన్మెంట్‌ బోర్డు, రుద్రనగర్‌. తిరుమల్‌నగర్, గాయత్రినగర్, అల్వాల్‌ మున్సిపల్‌ ఏరియా, లోతుకుంట, ఫాదర్‌ బాలయ్యనగర్, ఓయూటీ కాలనీ, రాధిక, చెర్లపల్లి, కీసర, రాంపల్లి, నాగారం, దమ్మాయిగూడ, హస్మత్‌పేట్, పేట్‌బషీరాబాద్‌ బ్యాంక్‌ కాలనీ, మీనాక్షి, డిఫెన్స్‌ కాలనీ, గౌతమ్‌నగర్, చాణక్యపురి.


లైవ్ టీవి


Share it
Top