logo

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే మురుగునీటి ప్రవాహం

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడే మురుగునీటి ప్రవాహం
Highlights

రాజధానిలో వర్షం తగ్గుముఖం పట్టిందే మురుగు వరద తగ్గట్లేదు. కుండపోత వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో...

రాజధానిలో వర్షం తగ్గుముఖం పట్టిందే మురుగు వరద తగ్గట్లేదు. కుండపోత వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్‌లో మ్యాన్‌హోళ్ల వరద కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వర్షాలు పడ్డప్పుడు... చెరువులను తలపించిన రోడ్లు... ఇంకా సాధారణ స్థితికి రాలేకపోతున్నాయ్‌. ఇప్పటికే ప్రమాదకర అనారోగ్యాలతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులు కొత్త సమస్యతో మరింత విలవిల్లాడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి రోడ్ల మీద ఎక్కడ చూసినా నీళ్ల్లు పారుతూ కనిపించాయి. దానికి కారణం.. వర్షపు నీరు పోవడానికి సరైన మార్గం లేకపోవడమే. నాలాలన్నీ ఆక్రమణకు గురి కావడంతో వరద రోడ్లను ముంచెత్తింది. నగరంలో చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్ల దగ్గరి నుంచి గల్లీల వరకు ఇదే దుస్థితి. వర్షం తగ్గన తరువాత చూసినా.. డివిజన్‌ బస్తీలలో రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన రహదారులపైనే గుంతలు పడ్డాయ్‌. పాదచారులు రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. దీనికి తోడు మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లుతున్నా సంబంధిత అధికారులకు పట్టింపు లేకుండాపోతోంది. దీంతో మురుగునీరు రహదారులపై ఏరులై పారుతోంది.

చిన్న పాటి వర్షం కురిసినా బస్తీలలో వరదనీరు సాఫీగా వెళ్లలేక గుంతులు ఏర్పడుతున్నాయి. రాత్రిపూట వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై అధికారులు రెండు వాదనలు వినిపిస్తున్నారు. వర్షం నీరు బయటకు వస్తేనే అది జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని, మురుగునీరైతే జలమండలి పరిధిలోకి వస్తుందంటున్నారు. ఎవరి పరిధిలోకి ఏది వచ్చినా.. మ్యాన్‌హోళ్ల నుంచి మురుగునీటి ప్రవాహన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top