ఐటీ రంగానికి వరంగల్‌ అనువైన పట్టణం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఐటీ రంగానికి వరంగల్‌ అనువైన పట్టణం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
x
Highlights

తెలంగాణ రాష్ట్రం దినదినాభి వృద్ది చెందుతుంది. ఇటు హైదరాబాద్ నగరం ఐటీ కంపెనీలతో, మెట్రో పరుగులతో వివిధ రకాల పరిశ్రమలతో ముందగుడు వేస్తూ అబివృద్ది చెందుతుంది.

తెలంగాణ రాష్ట్రం దినదినాభి వృద్ది చెందుతుంది. ఇటు హైదరాబాద్ నగరం ఐటీ కంపెనీలతో, మెట్రో పరుగులతో వివిధ రకాల పరిశ్రమలతో ముందగుడు వేస్తూ అబివృద్ది చెందుతుంది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో తెలంగాణలో రెండో అతి పెద్ద సిటీగా పేరుగాంచిన వరంగల్ కూడా ఈ విధంగా అభివృద్ది చెందడానికి ముందుకు అడుగులు వేస్తుంది. కాగా ఇప్పటికే వరంగల్‌లో రెండు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ సంస్థలను స్థాపించాయి. ఈ నేపథ్యంలోనే మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టనుంది.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కాజీపేట మండలం మడికొండలో టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఐటీ కంపెనీ నిర్మాణానికి గాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌కు మరో ఐటీ కంపెనీ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కంపెనీల ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గిపోతుందని తెలిపారు.



తెలంగాణ రాష్ట్రం దినదినాభి వృద్ది చెందుతుంది. ఇటు హైదరాబాద్ నగరం ఐటీ కంపెనీలతో, మెట్రో పరుగులతో వివిధ రకాల పరిశ్రమలతో ముందగుడు వేస్తూ అబివృద్ది చెందుతుంది.వరంగల్‌ ప్రజల పక్షాన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌లో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారు. ఐటీ రంగానికి వరంగల్‌ అనువైన పట్టణమని వివరించారు. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, ధర్మారెడ్డి, ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories