రూ.300 లకే ఆరు రకాల తాజా పండ్లు..వాట్సప్ చేస్తే హోం డెలివరీ..

రూ.300 లకే ఆరు రకాల తాజా పండ్లు..వాట్సప్ చేస్తే హోం డెలివరీ..
x
Fruits Distribution
Highlights

కరోనాతో వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో వ్యాపారస్తుల వ్యాపారాలు అన్నీ ఒక్క సారిగా ఆగిపోయాయి.

కరోనాతో వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో వ్యాపారస్తుల వ్యాపారాలు అన్నీ ఒక్క సారిగా ఆగిపోయాయి. ఉద్యాన తోటల్లో పంటలు అమ్ముడు పోక అవి పాడైపోతూ రైతులు నష్టపోయే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలకి అండగా మేమున్నాం అంటూ వాక్ ఫర్ వాటర్ సంస్థ ముందుకొచ్చి మార్కెటింగ్ సహకారం కల్పిస్తుంది. నల్గొండ, వరంగల్‌, పాత ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు పండించే పండ్లను సీ2K రైతు ఉత్పత్తిదారుల సంఘంతో కలసి హైదరాబాద్ మహానగరంలో ఫాం టూ హోం ద్వారా పండ్లను సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి, పండ్లు సరఫరా చేసే వాహనాలకి ప్రారంభించారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబంలో నలుగురికి వారానికి సరిపడే విధంగా పుచ్చ, బత్తాయి, సపోట, నిమ్మ, మామిడి, బొప్పాయి పండ్లని ప్యాక్ చేసి అందిస్తున్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీ సంఘాలు సుమారుగా 30 ప్యాకెట్లు తీసుకునేది ఉంటే వారికి ఉచితంగా డెలివరీ చేయనున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా వైద్యుల సూచనలను పాటిస్తూ ఏ, సీ విటమిన్లు దొరికే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని తెలిపారు. వీటిని ఎక్కువగా తినడంవలన కరోనా వైరస్ ను ఎదుర్కోవచ్చని ఆయన తెలిపారు. 'సహజ పండ్లతో ఆరోగ్యం పొందుదాం - ఇంట్లోనే ఉండి కరోనాని నిలువరిద్దాం' అని ప్రచారం చేసారు.

డెలివరీ చేసే పండ్లు:

పండ్ల పాకింగ్ లో సపోట(1 కేజీ), మామిడి(1.5 కేజీ), పుచ్చ(3-4 కేజీలు), బొప్పాయి‍ ‍(3 కేజీలు), బత్తాయి(2.5 కేజీలు), నిమ్మ కాయలు(12) ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.300/-. ఎవరైనా వివరాలను అడిగి తెలుసుకోవానుకునే వారు ఎం.కరుణాకర్‌ రెడ్డి అనే వ్యక్తిని 98494 33311 నెంబరులో ఫోను లేదా వాట్సాప్‌‌ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories