బతికుండగానే వృద్ధురాలు పోచమ్మను చంపేసిన వీఆర్వో..

బతికుండగానే వృద్ధురాలు పోచమ్మను చంపేసిన వీఆర్వో..
x
Highlights

చంపేశాడు. బతికుండగానే చంపేశాడు. కళ్లముందు ప్రాణాలతో కనిపిస్తున్నా.. రికార్డుల్లో చంపేశాడు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మెడికుంద గ్రామానికి చెందిన పోచమ్మను.. అసలామే బతికేలేదంటూ వీఆర్వో రామలింగం తేల్చేశాడు.

చంపేశాడు. బతికుండగానే చంపేశాడు. కళ్లముందు ప్రాణాలతో కనిపిస్తున్నా.. రికార్డుల్లో చంపేశాడు. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మెడికుంద గ్రామానికి చెందిన పోచమ్మను.. అసలామే బతికేలేదంటూ వీఆర్వో రామలింగం తేల్చేశాడు. తానెలా చనిపోయానో చెప్పాలంటూ.. మెడికుంద గ్రామానికి చెందిన పోచమ్మ.. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. తన పేరుపై ఉన్న భూమిని తన కుమారులపై ఎలా మార్చావంటూ వీఆర్వో రామలింగంను చొక్కా పట్టుకుని నిలదీసింది. తాను బతికుండగానే రికార్డుల్లో చనిపోయానని ఎందుకు మార్చావంటూ గల్లా పట్టుకుని ప్రశ్నించింది.

అంతే ఎక్కడా లేని కోపం తెచ్చుకున్న వీఆర్వో రామలింగం.. వృద్ధురాలు అని కూడా చూడకుండా పోచమ్మపై దురుసుగా ప్రవర్తించాడు. తాను చేసిన పనికి సిగ్గుపడకుండా నిలదీస్తున్న పోచమ్మను.. నెట్టేశాడు. దీంతో పోచమ్మకు సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు రామలింగంను అతని కార్యాలయంలోనే నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లుగా.. ఓ వీఆర్వో చేసే పని.. దేశంలో రాష్ట్రపతి కూడా చేయ సాధ్యం కాదని మరోసారి నిరూపితమైంది. మెడికుంద గ్రామంలో అదే నిజమైంది. పోచమ్మ పేరుపై ఉన్న భూమిని.. ఆమె కుమారుల పేరుపై వీఆర్వో మార్చేశాడు. అడిగే వాడెవడూ లేడని.. బరితెగించాడు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే బయటకు గెంటేశాడు. ఇలాంటి వీఆర్వోలపై చర్యలు తీసుకోవాలని.. రామలింగంను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories