VK Singh transfer: వీకే సింగ్‌పై బదిలీ వేటు

VK Singh transfer: వీకే సింగ్‌పై బదిలీ వేటు
x
Highlights

VK Singh transfer: తాజాగా తెలంగాణ పోలిస్ అకాడమీకి ఐపీఎస్ అధికారి వీకే సింగ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు

VK Singh transfer: తాజాగా తెలంగాణ పోలిస్ అకాడమీకి ఐపీఎస్ అధికారి వీకే సింగ్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే అయనను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వీకే సింగ్ ను ప్రభుత్వం ఆదేశించింది. అయన స్థానంలో వి.వి. శ్రీనివాస రావుకు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పేరిట జీవో జారీ చేశారు.

వి.వి. శ్రీనివాస రావు 1995 బ్యాచ్‌కు చెందినవారు. అయన ప్రస్తుతం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక గత కొంత కాలంగా వీకే సింగ్‌ తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరుతూ మూడు నెలల ముందుగానే నోటీసు ఇస్తున్నానని తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

ఇక తానూ రాజకీయాల్లో చేరడంలేదని వీకే సింగ్ స్పష్టం చేశారు. వివేకానంద, సుభాష్‌ చంద్రబోస్‌, మహాత్మాగాంధీల బాటలో తాను కూడా ప్రజలతో కలిసి పనిచేస్తానని అయన వెల్లడించారు. తన రాజీనామాకు అనుమతి వచ్చిన తర్వాత తాను ప్రజలతో కలిసి ఎలా పనిచేస్తానో వెల్లడిస్తానని అయన చెప్పుకొచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories