హైదరాబాద్‌కి జొరమొచ్చింది!

హైదరాబాద్‌కి జొరమొచ్చింది!
x
Highlights

హైదరాబాద్ నగరంలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ విభాగం ఉదయం సాయంత్రం కూడా పనిచేసేటట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌కి జొరమొచ్చింది. దగ్గు-జలుబు-జ్వరాలతో జనం వణికిపోతున్నారు. నగరంలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి. విషజ్వరాలతో ప్రభుత్వా ప్రయివేటు ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరగ్గా, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే, డెంగ్యూ పేరుతో డేంజర్ గేమ్‌ అడుతున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, చికెన్ ఫాక్స్‌, టైఫాయిడ్‌ తదితర వ్యాధులు ముప్పేట దాడి చేస్తుండటంతో జనం ఆస్పత్రుల ముందు క్యూకడుతున్నారు. చిన్న పిల్లల హాస్పిటల్స్ అయితే కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు దగ్గు-జలుబు-జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇక ఈ దెబ్బతో ఆసుపత్రులన్నీ రోగులతో కీటకీటలాడుతున్నాయి.

ఇక రోజు రోజుకి రోగుల తాకిడి మరింత పేరగడంతో ఆదివారం కూడా ఓపీ సేవలు అందిస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో ఇకనుంచి పొద్దూ మాపూ ఓపీ సేవలు అందనున్నాయి. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ సేవలు నిర్వహించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇక నగరంలోని ప్రము‌ఖ ఆసుపత్రులు ఫీవర్ హస్పీటల్లో 600, నిలోఫర్‌లో 285, ఉస్మానియా, గాంధీలో 100 మందికి చికిత్సలు చేశారు.

ఇటు సర్కారు దవాఖానాతో పాటు ప్రయివేటు ఆసుపత్రుల్లో సైతం రోగులు కిక్కిరిసిపోతున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 300 పడకల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోగులతో ఫుల్ అవ్వడంతో రోగులను ఇతర శాఖలకు పంపుతున్నారు. ఇటు సోమజీగూడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రోగులు క్యూకట్టడంతో ఆసుపత్రిలో పడకలు లేక వచ్చిన రోగులను వెనక్కి పంపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితితుల్లో ఆసుపత్రిలో చేరాలంటే కొద్ది రోజులు ఆగల్సిందేనని సూచిస్తున్నారు. మహానగరంలో డెంగీ జ్వరాలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దోమలు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి.

రోగులు ఆసుపత్రులకు క్యూకట్టంతో ఇదే అదునుగా వైద్యులు రోగుల జేబులు ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఈ పరీక్షల్లో డెంగీ నిర్ధారణ అయి.. నాలుగైదు రోజులపాటు చికిత్స పొందాలంటే దాదాపు రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. చికిత్స కోసం లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఈ జ్వరాలకు చెక్ పెట్టాలి అంటే.. ఇంట్లో ఒకరికి డెంగీ సోకితే మిగతా సభ్యులతోపాటు పరిసరాల్లో నివసించే వారందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories