ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాల విజృంభణ

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాల విజృంభణ
x
Highlights

కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు, జ్వరాలతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. భారీగా రోగులు తరలివస్తుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో రోగులకు బెడ్ల కొరత తీవ్రమైంది.

కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు, జ్వరాలతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. భారీగా రోగులు తరలివస్తుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో రోగులకు బెడ్ల కొరత తీవ్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఊర్లకు ఊర్లే విష జ్వరాలతో మంచాన పడుతున్నాయి. దీంతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు చికిత్స కోసం క్యూకడుతున్నారు. వేలసంఖ్యలో రోగులు తరలివస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం అధిక సంఖ్యలో రోగులు ఆస్పత్రికి వచ్చి చేరుతున్నారు.

ఆస్పత్రికి వస్తున్న వేలాది మంది రోగుల్లో 200 మంది విష జ్వరాలతోనే బాధపడుతున్నారు. రోగుల వ్యాధి నిర్ధారణ చేస్తే ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో రోజుకు ఒక డెంగీ కేసు బయటపడుతోంది. అదేవిధంగా టైఫాయిడ్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా బెడ్స్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్స్ కొరతను తీర్చేందుకు ఆయా ఆస్పత్రుల్లో మంచాలు ఏర్పాటు చేశారు. అయితే, వాటిలో పడుకోవడం ఇబ్బందిగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓ వైపు విష జ్వరాలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సర్కార్ ఆదేశించింది. దీనిలో భాగంగా రోగాలను నయం చేయడానికి 24 గంటల ఓపీ, వార్డుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. కానీ, ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందించడం లేదు. కీళ్ల నొప్పులు, జలుబు, జ్వరాలతో ఆస్పత్రికి వస్తే పట్టించుకోవడం లేదని డాక్టర్ల తీరుపై రోగులు మండిపడుతున్నారు. కేవలం స్టాఫ్ నర్సులే చికిత్స చేస్తున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories