వినాయక చవితి వివాదాలకు కేంద్రంగా మారుతోందా?

వినాయక చవితి వివాదాలకు కేంద్రంగా మారుతోందా?
x
Highlights

గులాబీ, కమలం రెండు పువ్వు పార్టీల మధ్య వినాయకుడి వివాదం మొదలైంది. వినాయకచవితి ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. ఊరికి ఒక్క వినాయకుడే...

గులాబీ, కమలం రెండు పువ్వు పార్టీల మధ్య వినాయకుడి వివాదం మొదలైంది. వినాయకచవితి ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. ఊరికి ఒక్క వినాయకుడే పెట్టాలని కొందరు గులాబీదళం ప్రచారం చేస్తుంటే దీన్ని ఖండిస్తున్న కమలనాథులు ఇది హిందూ పండగలపై జరుగుతున్న కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తోంది. అసలు రెండు పార్టీల మధ్య గణేషుడు చేస్తున్న గడబిడ ఏంటో చూద్దాం.

వినాయకచవితి ఇప్పుడు కొత్త వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. పండగ పేరుతో పార్టీలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఊరికి ఒక్క వినాయక విగ్రహాన్నే ప్రతిష్టించాలంటూ సిద్దిపేట జిల్లాలో కొందరు ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి హరీష్‌రావు తన మద్దతు తెలపటమే కాకుండా ప్రోత్సహక బహుమతులు ఇస్తానంటూ ప్రకటించారు. జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్చందంగా ముందుకు వచ్చాయ్‌. తీర్మానాలు కూడా చేశాయి. ఇలా మొత్తం మీద ఈ ఊరికి ఒక్క వినాయకుడు ప్రచారం మిగతా జిల్లాలకు పాకింది.

ఊరికి ఒక్క వినాయకుడు ప్రచారంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది హిందువుల పండగలపై జరుగుతున్న కుట్ర అని విమర్శిస్తోంది. ప్రజల్లో ఐకమత్యం పెంపొందించటానికే తిలక్‌ వినాయక నవరరాత్రులను ప్రారంభించారని కొందరు కావాలనే హిందువుల ఐక్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ భగ్గుమంటోంది.

ఈ రెండు పార్టీల హడావిడి ఇలా ఉంటే సీపీఐ మాత్రం కొత్త పల్లవి అందుకుంది. వినాయక నవరాత్రులు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని సీపీఐ ముందుకొచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌ కార్యాయలం ముందు ధర్నాకు దిగింది.

అటు బీజేపీ కూడా నిమజ్జనం సమయంలో మూడు రోజుల పాటు వైన్స్ మూసివేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి వినాయక చవితిని ప్రతీ పార్టీ ఎవరికి తోచినట్లు వారు తమ రాజకీయాలకు వేదిక చేసుకోవటంపై సామాన్య భక్తులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories