Top
logo

ఎలుగుబంటిని కొట్టి చంపిన స్థానికులు

ఎలుగుబంటిని కొట్టి చంపిన స్థానికులు
Highlights

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అక్కడక్కడ జంతువులు రోడ్లపై, గ్రామాల్లోకి వస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అక్కడక్కడ జంతువులు రోడ్లపై, గ్రామాల్లోకి వస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరంలో ఓ చిరుత రోడ్డుపై వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేసింది. నాలుగు రోజుల పాటు అలవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఓ ఎలుగుబంటి కూడా ఓ గ్రామంలోని ప్రజలకు చుక్కలు చూపించింది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దీంతో గ్రామంలోని ప్రజలంతా కలిసి ఆ ఎలుగుబంటిని కొట్టి చంపేసారు. అటవీ జంతువులను కొట్టి చంపడం నేరం అని తెలిసినా తమ ఆత్మరక్షణ కోసం గ్రామస్తులు ఎలుగును చంపక తప్పలేదు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తివివరాల్లోకెళ్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చిందివచ్చి జనాల్ని భయభ్రాంతులను చేసింది. కొద్ది సేపు జనాలపైకి వచ్చిన ఎలుగు బాలరాజు అనే వ్యక్తిపై దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దీంతో ఆ ఎలుగుబంటి భయంతో ఓ బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. వెంటనే గ్రామస్థులు దాన్ని బయటికి రానివ్వకుండా బాత్రూంకు కర్రలను అడ్డుగా పెట్టారు. ఆ తరువాత వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని దాన్ని బంధించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ ఆ ఎలుగు వారికి దొరకకుండా బాత్రూమ్ డోర్లను విరగగొట్టి బయటికి వచ్చింది. ఆ గందర గోళంలో నర్సింహులు అనే వ్యక్తిపైన కూడా దాడి చేసింది. ఒక వైపు కోపం, ఒక వైపు భయంతో గ్రామస్థులు కర్రలు ,రాళ్లతో ఎలుగును వెంబడించి దాడి చేశారు. వారు కొట్టిన దెబ్బలకు ఎలుగుకు తీవ్ర గాయాలు కావడంతో పశువుల ఆస్పత్రికి తరలించారు. అడవి జంతువు దాడిలో గాయపడిన స్థానికుల్ని ఆస్పత్రికి తరలించారు.

Web TitleVillagers in Kammareddy District Attack and Killed Bear at Kannapur thanda Telangana
Next Story