విద్యుత్‌ శాఖ అధికారులపై దాడి..48 గంటలుగా కరెంట్ బంద్

విద్యుత్‌ శాఖ అధికారులపై దాడి..48 గంటలుగా కరెంట్ బంద్
x
Highlights

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్ గ్రామం 48 గంటలుగా అంధకారంలోనే ఉంది. తనిఖీలకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేయడం వల్లే విద్యుత్...

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్ గ్రామం 48 గంటలుగా అంధకారంలోనే ఉంది. తనిఖీలకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేయడం వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 48 గంటలుగా విద్యుత్ లేకపోవడంతో గ్రామంలో అంధకారం అలుముకుంది. ఒకరిద్దరు చేసిన తప్పునకు ఊరంతటిపై శిక్ష వేయడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీళ్లు రావడం లేదు. లైట్లు వెలగడం లేదు ఫ్యాన్లు తిరగడం లేదు. రాత్రంతా చీకట్లో జాగారం చేస్తున్నారు. రెండు రోజులుగా కరెంట్ లేకపోవడంతో కనీసం ఫోన్ చార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా లేదు. దీంతో మొబైల్ ఫోన్లు అన్ని స్వీచ్ ఆఫ్ అయిపోయాయి. దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని అయినప్పటికీ అధికారులు కరెంటు సరఫరా నిలిపేసి కక్ష సాధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సోమూర్ గ్రామస్తులు అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారంటూ రెండు రోజుల క్రితం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇళ్లల్లో మీటర్ల ఫొటోలు తీస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని అధికారులను నిర్బంధించారు. ఎన్నిసార్లు తమపై కేసులు పెడతారంటూ తిరిగబడ్డ గ్రామస్తులు అధికారులపై దాడి చేశారు. దీంతో విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం సోమూర్ విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.ఎవరో ఒకరు దాడి చేసిన దానికి ఊరంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సోమూర్ గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా విద్యుత్ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories