ఆత్మగౌరవం కోసం మహిళల ముందడుగు

ఆత్మగౌరవం కోసం మహిళల ముందడుగు
x
Highlights

మహిళల ఆత్మగౌరవం, రక్షణ కోసం ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా కట్టుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, వాటి నిర్మాణానికి నిధులిస్తున్నా ఇప్పటికీ పలు...

మహిళల ఆత్మగౌరవం, రక్షణ కోసం ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా కట్టుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, వాటి నిర్మాణానికి నిధులిస్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో మరుగుదొడ్లు కట్టించుకొనేందుకు కొందరు సుముఖత చూపడం లేదు. అలాంటి వారిని చైతన్య పరిచేందుకు నడుంబిగించారు కొంతమంది మహిళలు, మరుగుదొడ్లు లేనివారి ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ వాటి ఆవశ్యకతను వివరించారు. మరుగుదొడ్డి ఖచ్చితంగా కట్టించుకోవాలని కోరారు.

స్వచ్ఛభారత్ నినాదంతో గ్రామం పరిశుభ్రత కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ మహిళలు కలిసి వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రామాలు సుమారు 2 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ సుమారు 450 పైగా కుటుంబాలు నివసిస్తున్నారు, వీటిలో దాదాపు ఇప్పటికే 75శాతానికి పైగా మరుగుదొడ్లు పూర్తి అయ్యాయి, మిగతావి కూడా పూర్తి చేసి 100శాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామ పంచాయతీగా ప్రకటింప చేయాలని సంకల్పంతో మహిళలు మరియు గ్రామస్తులు వినూత్న ప్రచారంను విస్తృతంగా చేపట్టారు.

గ్రామాల్లో తిరుగుతూ మరుగుదొడ్లు కట్టించుకోడానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని గురించి వివరించి. బొట్టు పెట్టి, దండం పెడుతూ మరుగుదొడ్లు కట్టించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు తప్పకుండా కట్టించుకుంటామని చెబుతున్నారు, మిగిలిన 25 శాతం మరుగుదొడ్లను కూడా నిర్మించి మండలంలోనే మొదటి ఓడీఎఫ్ పంచాయతీగా నాయకులగూడెం పంచాయతీ గా ప్రకటించుకుంటామని గ్రామ సర్పంచ్ మరియు మహిళలు చెబుతున్నారు. మొత్తానికి మరుగుదొడ్లు తప్పనిసరి అంటూ మహిళలు చేస్తున్న వినూత్న ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories