బస్సుదొంగ దొరికాడు..ఎవరో తెలుసా..?

బస్సుదొంగ దొరికాడు..ఎవరో తెలుసా..?
x
Highlights

మూడు రోజుల వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సును ఓ దుండగుడు డ్రైబర్, కండక్టర్ భోజనానికి దిగగా వారు లేని సమయం చూసి అతను...

మూడు రోజుల వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సును ఓ దుండగుడు డ్రైబర్, కండక్టర్ భోజనానికి దిగగా వారు లేని సమయం చూసి అతను బస్సును అపహరించుకు వెళ్లిపోయాడు. భోజనం తరువాత బస్సు సిబ్బంధి వచ్చి చూడగా బస్ కనిపించకపోవడంతో వారు డిపో మేనేజర్ రాజశేఖర్ కు తెలిపిన విషయం తెలిపారు. ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి మద్యం మత్తులో బస్సును తానే డ్రైవర్, తానే కండక్టర్ అని చెప్పి బస్సును అపహరించాడు. అంతే కాకుండా అతని ఇష్టారీతిగా బస్సును నడిపడంతో ప్రయాణికులు అతనిని నిలదీయడంతో బస్సును నగర శివారులోని రోడ్డుపైనే ఆపి పరారయ్యాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం రక్షణ విషయంలో నిర్లక్ష్యమం వహిస్తుందని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. దీంతో స్పందించిన అదికారులు ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతూ. కాగా ఈ విషయంపై అదే రోజున వికారాబాద్ డిపో మేనేజన్ రాజశేఖర్ స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దొంగ ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టారు.

బస్సును ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు కనిపెట్టి అరెస్ట్ చేశారు. అతను ఆర్టీసీలోనే పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆంజనేయులుగా గుర్తించారు. అతను బస్సుల వాషింగ్ సెంటర్లో పనిచేస్తున్నట్టుగా నిర్ధారించారు. ఆంజనేయులు తాగిన మత్తులో బస్సును ఎత్తుకెళ్లాడని పోలీసులు స్పష్టం చేసారు. అతను తాగి జల్సాలు చేసేవాడని, వచ్చిన జీతం అంతా కూడా జల్సాలకు ఖర్చు చేసే వాడని తెలిపారు. వచ్చిన జీతం అతని జల్సాలకు సరిపడకపోవడంతో బస్సును ఎత్తుకెళ్లి దాన్ని విడివిడిగా చేసి స్రాబ్ అమ్ముదామని ఆలోచనతో ఈ దొంగతనం చేసాడని స్పష్టం చేసారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories