సురేష్‌ అక్కడికి ఎన్నిగంటలకు వెళ్లాడు.. అసలక్కడ మినిట్‌ టూ మినిట్‌ ఏం జరిగింది..

Vijaya Reddy
x
Vijaya Reddy
Highlights

యధావిధిగా తహశీల్దార్‌ మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. అనంతరం తన ఛాంబర్‌లో ఆమె ఒంటరిగా కూర్చుకున్నారు. ఇదే అదునుగా చూసుకున్న నిందితుడు.. అధికారిణిపై...

యధావిధిగా తహశీల్దార్‌ మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. అనంతరం తన ఛాంబర్‌లో ఆమె ఒంటరిగా కూర్చుకున్నారు. ఇదే అదునుగా చూసుకున్న నిందితుడు.. అధికారిణిపై పెట్రోల్‌ పోసినిప్పంటించాడు. అసలు సురేష్‌ అక్కడికి ఎన్నిగంటలకు వెళ్లాడు..? ఆమె ఛాంబర్‌లోకి ఎలా వెళ్లాడు..? అసలక్కడ మినిట్‌ టూ మినిట్‌ ఏం జరిగింది.. ఇప్పుడు చూద్దాం.

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడు సురేష్‌ ఉదయం 11గంటల వరకు ఇంట్లోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటివరకు కుటుంబ సభ‌్యులతో కలిసి ఇంటి పనులు చేసిన సురేష్ ఆ తర్వాత బయటికెళ్లాడని చెబుతున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సురేష్‌ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అంటున్నారు. అయితే, మధ్యాహ్నం పన్నెండున్నరకి అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి సురేష్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, తహశీల్దార్ విజయారెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకే భోజనం ముగించుకుని తన ఛాంబర్‌లో కూర్చోగా ఒకటిన్నర సమయంలో నిందితుడు సురేష్ లోపలికి వచ్చినట్లు చెబుతున్నారు. మాట్లాడే పని ఉందంటూ విజయారెడ్డి ఛాంబర్‌లోకి వెళ్లిన సురేష్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అయితే ముందస్తు ప్లాన్‌ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను బయటికి తీసిన సురేష్ ఒక్కసారిగా విజయారెడ్డిపై పోసి నిప్పంటించాడు. దాంతో మధ్యాహ్నం 1:55కి అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్ధం రావడంతో మిగతా ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అయితే, తన ఛాంబర్ ముందు విజయారెడ్డి మంటల్లో తగలబడిపోతుండటాన్ని గమనించి కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే విజయారెడ్డి మంటల్లో కాలి మృత్యువాతపడ్డారు.

మధ్యాహ్నం 12గంటలు

ఇంటి నుంచి బయల్దేరిన సురేష్... కాసేపటికే ఫోన్ స్విచ్చాఫ్‌

మధ్యాహ్నం 12:30

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సురేష్‌

మధ్యాహ్నం 1.00

అప్పుడే భోజనం చేసి తన ఛాంబర్‌లో కూర్చున్న విజయారెడ్డి

మధ్యాహ్నం 1.30

తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్‌లోకి వెళ్లిన నిందితుడు సురేష్‌

మధ్యాహ్నం 1.35

తహశీల్దార్ విజయారెడ్డి - నిందితుడు సురేష్‌ మధ్య వాగ్వాదం

మధ్యాహ్నం 1:55

విజయారెడ్డిపై పెట్రోల్ పోసి... నిప్పంటించిన సురేష్‌

మధ్యాహ్నం 1:56

తహశీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం

మధ్యాహ్నం 1:57

గ్యాస్ సిలిండర్ పేలిందేమోనని ఉద్యోగుల పరుగులు

మధ్యాహ్నం 1:58

తన ఛాంబర్ తలుపు దగ్గర మంటల్లో విజయారెడ్డి

మధ్యాహ్నం 2:00

అరుపులు కేకలతో గిలగిలా కొట్టుకున్న విజయారెడ్డి

మధ్యాహ్నం 2:05

విజయారెడ్డిని కాపాడేందుకు ఉద్యోగుల ప్రయత్నం

మధ్యాహ్నం 2:10

మంటల తీవ్రతకు సజీవ దహనమైన విజయారెడ్డి

మధ్యాహ్నం 2:45

తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన పోలీసులు

మధ్యాహ్నం 3:10

గాయాలతో పట్టుబడిన నిందితుడు సురేష్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories