Top
logo

వీహెచ్‌ సంచలన కామెంట్లు

వీహెచ్‌ సంచలన కామెంట్లు
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ వీ హనుమంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల్లో...

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ వీ హనుమంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల్లో ఆత్మకు ఏం పని అంటూ వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్‌ చాట్ చేసిన వీహెచ్‌, భట్టి దీక్షను అడ్డుపెట్టుకుని రాష్ట్ర నాయకత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అధినేత రాహుల్‌కు వివరిద్దామని అపాయింట్‌మెంట్‌ కోరితే, 5 నెలలుగా దొరకడం లేదని అన్నారు. జాతీయ నాయకత్వానికి పట్టనిది నాకెందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క కేవీపీ శిష్యుడా లేక వీహెచ్‌ శిష్యుడా అన్నది ఆయనే చెప్పాలని భట్టి కోసం తానేం చేశానో అడిగి తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణకు కిరణ్‌ బేడీ గవర్నర్‌గా రావాలని వీహెచ్‌ ఆకాంక్షించారు.

Next Story


లైవ్ టీవి