వింత వైరస్ : 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..

వింత వైరస్ : 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..
x
వింత వైరస్ : 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..
Highlights

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి...

ప్రపంచమంతా కరోనా వైరస్‌తో గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో చికెన్ సేల్స్ డౌన్ అయిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వింత వైరస్ వల్ల సుమారు 30 వేల కోళ్లు చనిపోవడం సంచలనంగా మారింది. పౌల్ట్రీ ఫారం యజమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు. దీంతో పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్ల నమూనాలను పరీక్షలనిమిత్తం ల్యాబ్‌కు పంచించారు. కోళ్ల మృతికి వీఎన్‌డీ వైరస్‌ కారణమని తేల్చి చెప్పారు.

ఖమ్మం జిల్లాలో కోళ్లు వరుసగా చనిపోతున్నాయి. వింత వైరస్ వాటి ప్రాణాలు తీస్తోంది. తాజాగా చనిపోయిన కోళ్ల సంఖ్య 35 వేలు దాటింది. పెనుబల్లి మండలంలో పెద్ద పెద్ద కోళ్లఫారాల్ని ఏర్పాటు చేసి లక్షల కోళ్లను పెంచుతున్నారు. ఐతే పది రోజులుగా కోళ్లు వేల కొద్దీ చనిపోవడం కలపాటుకు గురిచేస్తోంది. కోళ్లు మృత్యువాతపడటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టి కోళ్లను పెంచుతుంటే అవి చనిపోతుండటంతో తాము ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

ఒక్కసారిగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయి పడి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్ల కళేబరాలను తెచ్చి జనావాసాల మధ్య పడవేయటం పై వారు మండిపడుతున్నారు. గోతుల్లో వేసిన కోళ్లపై మట్టితో కప్పకపోవడంతో కుక్కలు వాటిని తీసుకెళ్లి ఆరుబయట తింటున్నాయి. దుర్వాసన వస్తోందని నాయకులగూడెం గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు వైరస్‌ భయంతో నాన్‌ వెజ్ అందులోనూ చికెన్‌ని తినడం మానేశారు మాంసాహారులు. దీంతో చికెన్ విలువ మార్కెట్లో దారుణంగా పడిపోయింది.

అసలు ఇన్ని వేల కోళ్లు ఒకేసారి మరణించడానికి గల కారణం ఏమిటనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారితే అధికారులు మాత్రం వీఎన్‌డీ వైరస్‌ వల్లే చనిపోతున్నాయని చెబుతున్నారు. ఏపీలోని నూజివీడు ప్రాంతం నుంచి ఆ కోడిపిల్లలను పెనుబల్లికి తీసుకువచ్చారని అక్కడి నుంచి ఈ వైరస్ వ్యాపించిందని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి మే వరకూ ఎండలు పెరిగే సమయంలో VND వైరస్ కోళ్లకు సోకుతుందని దాన్ని టీకాలతో ద్వారా నియంత్రించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories