అవినీతిలో భార్యాభర్తలు ... మొన్న భార్య... నేడు భర్త

అవినీతిలో భార్యాభర్తలు ... మొన్న భార్య... నేడు భర్త
x
Highlights

ఇద్దరు భార్యభర్తలు ... మళ్ళీ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగులే .. అందులో ఒకరికి ఉత్తమ తహసీల్దారు అనే పేరు కూడా ఉంది . కానీ లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు...

ఇద్దరు భార్యభర్తలు ... మళ్ళీ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగులే .. అందులో ఒకరికి ఉత్తమ తహసీల్దారు అనే పేరు కూడా ఉంది . కానీ లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కడంతో ఉత్తమ తహసీల్దారు కాస్తా అవినీతి తహసీల్దారుగా ముద్రపడిపోయింది . 93 లక్షల నగదును ఇంట్లో ఉంచుకొని ఏసీబీ అధికారులకు చిక్కిన లావణ్య విషయం జరిగి రెండు నెలలు కాకముందే ఆమె భర్త వెంకటేశ్వర్ నాయక్ ఏసీబీ అచ్చేశ్వర్ రావు బృందానికి చిక్కాడు... వెంకటేశ్వర్ నాయక్ జీహెచ్‌ఎంసీలో సూపరింటెండ్‌గా పనిచేస్తున్నారు . హన్మకొండకి చెందినా రణధీర్ అనే వ్యక్తికి హైదరాబాదులోని ఓ ఆర్‌డీఎంఏ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని రెండున్నర లక్షల రూపాయల లంచం తీసుకొని నకిలీ నియామక పత్రాన్ని ఇచ్చాడు .

దీనికి తోడు మరో నలబై వెయిల రూపాయలు అడిగాడు . తీరా అది నకిలీపత్రం అని తెలుసుకున్నా రణధీర్ దీనిపైన వెంకటేశ్వర్ నాయక్ ప్రశ్నించగా పోలీసులకు పట్టిస్తానని బెదిరించడంతో రణధీర్ బయపడి సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే వెంకటేశ్వర్ నాయక్ భార్య లావణ్యను అవినీతి శాఖా అధికారులు అరెస్ట్ చేయడంతో దైర్యం తెచ్చుకున్నా రణధీర్ జరిగిన విషయాన్ని మొత్తం ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్ రావుకి చెప్పి ఆధారాలు కూడా ఇవ్వడంతో అయన బృందం వెంకటేశ్వర్ నాయక్ పై నిఘా ఉంచి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories