మాతృభాషను, జన్మభూమిని మరిచిపోవద్దు: ఉపరాష్ట్రపతి

మాతృభాషను, జన్మభూమిని మరిచిపోవద్దు: ఉపరాష్ట్రపతి
x
Highlights

వరంగల్‌లోని ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థ 75వసంతాలు పూర్తి చేసుంది. ఈ సందర్భంగా ఆదివారం విద్యాసంస్థ నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.

వరంగల్‌లోని ఆంధ్ర విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థ 75వసంతాలు పూర్తి చేసుంది. ఈ సందర్భంగా ఆదివారం విద్యాసంస్థ నిర్వహిస్తున్న ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల పాలించిన వరంగల్ కు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. వరంగల్‌ అంటే ఎంతో ప్రేమ, అనుబంధం ఉందని, వరంగల్ విద్యా, సాంస్కృతిక, సాహిత్యానికి కేంద్ర బిందువుగా ఉందని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను మరిచిపోవద్దని అన్నారు. అదే విధంగా మాతృభాషను, జన్మభూమిని కూడా మరిచిపోవద్దని, విదేశాలకు వెళ్లి సంపాదించుకుని తిరిగి భారత దేశానికి రావాలని అన్నారు.

భారతదేశంలోని 65 శాతానికి పైగా ఉన్న యువతే భారత దేశానికి పెద్ద బలం అని అన్నారు. వచ్చే 35 ఏళ్లపాటు ప్రపంచానికి అవసరమైన మానవవనరులను అందించే శక్తి సామర్థ్యాలు భారత్ వద్ద ఉన్నాయి. ఇందుకోసం అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. సృజనాత్మక, నిత్య నూతన ఆలోచనలతో విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. అనంతరం నీటి పారుదల గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదలకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కాకతీయుల కాలంలో కూడా వరంగల్ నగరంలో ఎన్నో చెరువులను నిర్మించారని తెలిపారు. వారు నిర్మించిన చెరువులు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, రాజ్యసభ సభ్యు లు కెప్టెన్ లక్ష్మికాంత రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories