కొండెక్కిన కూరగాయలు ధరలు..

కొండెక్కిన కూరగాయలు ధరలు..
x
Highlights

కూరగాయధరలు భగ్గుమంటున్నాయి. గత నెలతో పొలిస్తే.. రెట్లు ఆమాంతం పెరిగిపోయాయి. మిర్చి మంటపుట్టిస్తుంటే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో కూరగాయలను...

కూరగాయధరలు భగ్గుమంటున్నాయి. గత నెలతో పొలిస్తే.. రెట్లు ఆమాంతం పెరిగిపోయాయి. మిర్చి మంటపుట్టిస్తుంటే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో కూరగాయలను కొనేందుకు జనం జంకుతున్నారు. ఓ వైపు పెరిగిన గుడ్ల ధరలు. మరోవైపు పెరిగిన కూరగాయలను చూసి ఆవేదన చెందుతున్నారు. సంచితో కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు సామాన్య జనం. పెరిగిన కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల్లో అంతకంతకు పెరిగిన ధరలు.. వినియోగదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పచ్చి మిర్చి, కాకరకాయ,టమాట ధరలు అమాంతం పెరిగిపోయాయి. క్యారెట్‌, మిర్చి టమాట ధరలు సెంచరీ వైపు పరుగులు పెట్టగా మిగత కూరగాయాలు ఆఫ్‌సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక సతమతమవుతున్నారు.

హైదరాబాద్‌లోని మెహదీపట్నం రైతు బజార్ లో అన్నికూరగాయాల ధరలు డబుల్‌, త్రిబుల్‌ రేట్లు అయ్యాయి. వంకాయ, ఆలుగడ్డ, క్యాబేజీ,చిక్కుడు, బెండకాయ, క్యాపికమ్‌, బీట్‌రూట్‌ 50 నుంచి 60 పైనే పలుకుతున్నాయి. మొన్నటి వరకు 10 రూపాయలున్న టమాట ధర 100 రూపాయలకు చేరింది. సొరకాయ, బీరకాయ రేట్లు భగ్గుమంటున్నాయి. . కొన్ని రకాల కూరగాయలయితే వెతికినా అసలు మార్కెట్‌లోనే కనిపించడంలేదు. ఇక వీటితో పాటు ఆకుకూర ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు దిక్కులు చూస్తున్నారు. వర్షాలు పడి కొత్త పంట వచ్చే కూరగాయల ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చే కూరగాయలన్ని కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నామంటున్న వ్యాపారులు దూరం నుంచి కూరగాయలు దిగుమతి అవుతుండటంతో రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

పెరిగిన కూరగాయల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. గతంలో కిలో కూరగాయలను తీసుకెళ్లే కస్టమర్లు,, ప్రస్తుతం అరకిలో, పావు కిలోతోనే సరి పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 100 రూపాయాలు తీసుకెళ్తే సంచినిండా కూరగాయాలు వచ్చేవని, ప్రస్తుతం 500 వందలు తీసుకెళ్లినా సరిపడ వెజిటేబుల్స్‌ రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు ఆశించినంత లేకపోవడంతో ప్రస్తుతం ఎన్నడూ లేనివిధంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయంటున్నారు రైతులు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే తప్ప కూరగాయల రెట్లు తగ్గవని చెబుతున్నారు. ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొండెక్కిన కూరలు కొనడం మానేశామంటున్నారు కస్టమర్లు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories