Top
logo

వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌

వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌varawara Rao (File Photo)
Highlights

విప్లవ ర‌చ‌యిత, విరసం నేత వ‌ర‌వ‌ర‌రావు, నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ బీమా కోరేగావ్ కుట్ర కేసులో ప్రస్తుతం పూణే జైలులో ఉన్న విషయం తెలిసిందే.

విప్లవ ర‌చ‌యిత, విరసం నేత వ‌ర‌వ‌ర‌రావు, నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ బీమా కోరేగావ్ కుట్ర కేసులో ప్రస్తుతం పూణే జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వారు ఇద్దరూ తమకు బెయిల్ మంజూరు చేయాలని ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పిటిషన్ల పై న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది.

మహారాష్ట్రలో 2018లో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లలో వరవర రావుతో పాటు, మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందనే అభియోగాలతో పుణే పోలీసులు అరెస్టు చేశారు. కాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వారిని కొనాళ్ల పాటు గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఆ తరువాత గౌతమ్ నవలాఖానుకు కోర్టు విముక్తి కల్పించి, మిగతా నలుగురిని మళ్లీ పోలీసులు నవంబరులోఅరెస్టు చేసి జైలులో నిర్భంధించారు. ఆ నలుగురికి మావోయిస్టులతో సంబంధం ఉందని, ఆధారాలు లభించినందుకే అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Web Titlevarawara Rao bail denied in the Bhima Koregaon conspiracy case
Next Story