ఉత్తమ్ ఫెయిల్, వి.హెచ్ కి పీసీసీ ఇవ్వాలిసిందేనా ?

ఉత్తమ్ ఫెయిల్, వి.హెచ్ కి పీసీసీ ఇవ్వాలిసిందేనా ?
x
Highlights

పార్టీలో అయన ఓ సీనియర్ నేత .. కానీ ఈ వయసులో కూడా అయన దూకుడు చూస్తుంటే చాలా మందికి ముచ్చటేస్తుంది . కానీ కాంగ్రెస్ పార్టీ నుండి అయనపై భిన్న స్వరాలూ...

పార్టీలో అయన ఓ సీనియర్ నేత .. కానీ ఈ వయసులో కూడా అయన దూకుడు చూస్తుంటే చాలా మందికి ముచ్చటేస్తుంది . కానీ కాంగ్రెస్ పార్టీ నుండి అయనపై భిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి . ఈ వయసులో కూడా అయన పనితీరుపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఈ దూకుడుకి బ్రేక్ వేస్తే బాగుండు అని అనుకుంటున్నారు . ఆయనే కాంగ్రెస్ కురవృద్దుడు వి.హెచ్ హనుమంతరావు ...

ప్రస్తుతం అయనకి వయసు 70 సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీలో అయన 20 ఏళ్ల కుర్రాడిలాగా దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు,మంత్రి, ఎమ్మెల్సి , రాజ్యసభ సభ్యుడు , ఇలా విభిన్నమైన పదవులు పోషించి పార్టీలో కీ రోల్ ప్లే చేసారు . అయితే ఇప్పటి కాంగ్రెస్ పరిస్థితి మనకు తెలిసిందే .

గత సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 19 సీట్లే... ఇందులో 11 మంది జంప్ .. ఇక ప్రభుత్వం తప్పు చేసి పోరాటం చేసే ఛాన్స్ ఇచ్చినా సరైనా పోరాటం చేయడంలేదు అనే విమర్శలు ఎదురుకుంటుంది . ఇలా ఉన్న పార్టీని చక్కదిద్దవలిసిన కాంగ్రెస్ నాయకులూ ఎవరిదారిలో వారు ఉన్నారు . ఐతే ఇందులో వి.హెచ్ ఇప్పటికి కీరోల్ ప్లే చేస్తూ ఎక్కడ చుసిన ఆయనే కనిపిస్తున్నారు ...

ఇంటర్ విద్యార్దులు చనిపోతే వాళ్ళ కుటుంబాలను కలిసి వారికీ ఆర్ధిక సహాయం చేయడం , ధర్నాలలో పాల్గొనడం , గ్లోబరీనా సంస్థపై కేటిఅర్ కి సవాల్ విసిరారు . హాజీపూర్ ఘటనకి వెళ్లి సందర్శించారు . అంబేద్కర్ విగ్రహం తీసేస్తే ధర్నాకి దిగారు . తిరిగి విగ్రహం పెట్టకపోతే అమరణదీక్షకు దిగుతానని అన్నారు . ట్రాఫిక్ చలనాల పై ఫైర్ అయ్యారు . ఇలా ఎక్కడపడితే అక్కడ వి.హెచ్ కాంగ్రెస్ ని ముందుండి నడిపిస్తున్నారు .

ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే కాదు . సొంత పార్టీలో కోవర్టులు ఉన్నారని దైర్యంగానే చెప్పారు . గత ఎన్నికల్లో చేసిన తప్పులని ఎత్తి చూపారు . ఇంతా చేస్తున్న వి.హెచ్ పై సొంత పార్టీ నుండి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి . అయన ఇప్పటికి పార్టీనుండి కష్టపడుతున్నారు అని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం ఈ వయసులో ఆయనకి ఇంత దూకుడు , ఆవేశం పనికిరావని అంటున్నారు . ఏది ఏమైనా వి.హెచ్ తనదైన శైలిలో దూసుకుపోవడం అభిననదించవలిసిన విషయమే.. అందుకేనేమో కాంగ్రెస్ పీసీసీ భాద్యతలు నుండి ఉత్తమ్ ని తప్పించి వి.హెచ్ అప్పజెప్పాలని కొందరు కాంగ్రెస్ నాయకుల వాదన .. ఇందులో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి ..

Show Full Article
Print Article
Next Story
More Stories