Top
logo

నూతన సచివాలయం అవసరం లేదు: ఉత్తమ్‌

నూతన సచివాలయం అవసరం లేదు: ఉత్తమ్‌
Highlights

తన కుమారుడిని సీఎం చేసే లక్ష్యంతో వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని కూలగొట్టడంతో పాటు కొత్త అసెంబ్లీని...

తన కుమారుడిని సీఎం చేసే లక్ష్యంతో వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని కూలగొట్టడంతో పాటు కొత్త అసెంబ్లీని నిర్మిస్తున్నారని ఆల్‌ పార్టీ మీటింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్షాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కొత్త అసెంబ్లీ నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సచివాలయంలోని దాదాపు అన్ని బ్లాకులు కొత్తగా నిర్మించినవే అని భవనాల కూల్చివేత, ప్రజాధనం దుర్వినియోగమే అవుతుందని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో సైతం లేవనెత్తుతామని ప్రజాభిప్రాయం సేకరిస్తామని స్పష్టం చేసింది. ఈ మీటింగ్‌లో కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ భవనం చరిత్రాత్మకమైనదన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీలో రెండు రాష్ట్రాల సభలు నడిచాయని గుర్తు చేశారు. నూతన సచివాలయం, శాసనసభల నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top