రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రంపైనే వేసింది: కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రంపైనే వేసింది: కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి
x
Kishan Reddy (file photo)
Highlights

రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోళ్లపై నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం అత్యధిక మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోళ్లపై నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం అత్యధిక మెట్రిక్‌ టన్నుల కందులను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని కేంద్రహోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కందుల కొనుగోళ్లపై తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేసారు. ఈ కోణంలోనే కంది, పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర అధికారులతో చర్చించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగనే 51,600 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రం మీదే వేసిందన్నారు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. కానీ రైతు సమస్యలను అర్థం చేసుకున్న కేంద్రం 20 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని కొనుగోలు చేసిందని స్పష్టం చేసారు. రాష్ట్రం కేంద్రాన్ని మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని కోరిందని, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఇందుకు ముందుకు వచ్చిందని ఆయన స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories