బఫర్ జోన్లపై ఎలా నిఘా పెట్టాలి : తెలంగాణకు కేంద్రం సూచన

బఫర్ జోన్లపై ఎలా నిఘా పెట్టాలి : తెలంగాణకు కేంద్రం సూచన
x
Highlights

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇంతకింతకు రెట్టింపవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇంతకింతకు రెట్టింపవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ ఆయా రాష్ట్రాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసాంద్రత ఎక్కవగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో, కరోనా కేసులు ఎక్కవగా నమోదవుతున్న రాష్ట్రాల్లో అధికారులు వెంటనే అప్రమత్తమై ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

అనంతరం వారిని విడిగా హోం క్వారంటైన్ చేయాలని సూచించింది. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమవ్వాలని సూచించింది. అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. బఫర్ జోన్లపై ఎలా నిఘా పెట్టాలి, కంటైన్మెంట్ జోన్లలో కరోనా కట్టడికి ఎలా వ్యవహరించాలి అన్న విషయాలపై అధికారులకు సూచనలు చేశారు.

ప్రజలను అప్రమత్తం చేస్తూనే ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించడంపై దృష్టిసారించాలన్నారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను భాగస్వాములు కావాలన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో జిల్లాల వారీగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బఫర్‌ జోన్లలోని తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ తరహా అనారోగ్య సమస్యలున్న రోగులను గుర్తించాలన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి సకాలంలో రోగులను గుర్తించాలని సూచించారు. మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని, టెస్టుల ఫలితాలు సకాలంలో వచ్చేలా చూడాలని, రోగులకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories