మద్యంమత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు అరెస్ట్

మద్యంమత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు అరెస్ట్
x
Highlights

మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారును రాష్ గా నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు. ఆ...

మేడ్చల్ కొంపల్లి జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఇన్నోవా కారును రాష్ గా నడుపుతూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు. ఆ తర్వాత మూడు వాహనాలను ఢీ కొట్టారు. స్కూటీని ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఇన్నోవా కారును స్పీడ్ గా నడిపిస్తూ ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందగా, బాలుడికి చికిత్స కొనసాగుతోంది. మృతురాలిని దూలపల్లికి చెందిన శ్రీదేవిగా గుర్తించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ లో ఆమె పనిచేస్తుంది. సెప్టెంబర్ 2 వతేదీన శ్రీదేవి పుట్టిన రోజు. బర్త్ డే షాపింగ్ కోసం ఆమె తన అన్న కొడుకుతో కలిసి స్కూటీపై వెళుతుండగా ఇన్నోవా కారు ఢీ కొట్టింది.

స్కూటీని ఢీ కొట్టిన తర్వాత ఇన్నోవా కారు మూడు వాహనాలను ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం తర్వాత తేరుకున్న యువకులు దారి మధ్యలో కారును వదిలి పారిపోయారు. ఇన్నోవా కారు నెంబర్ AP 09 CM 4366గా వుంది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ రోడ్డు ప్రమాదం ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సెయింట్ మేరిస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరు అల్వాల్ లో ఇన్నోవా కారు అద్దెకు తీసుకున్నారు. మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేస్తూ స్కూటీతో సహా నాలుగు వాహనాలను ఢీ కొట్టారు. స్కూటీని ఢీ కొట్టిన ప్రమాదంలో శ్రీదేవితో పాటు ఆమె సోదరుడి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీదేవి మృతి చెందింది. బాలుడికి చికిత్స కొనసాగుతోంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories