మహా నగరానికి మెట్రో మణి హారం..నేటికి సరిగ్గా రెండేళ్లు

మహా నగరానికి మెట్రో మణి హారం..నేటికి సరిగ్గా రెండేళ్లు
x
Highlights

హైదరాబాద్ మహా నగరానికి మెట్రో మణి హారం సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (28 నవంబర్)అమరింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో...

హైదరాబాద్ మహా నగరానికి మెట్రో మణి హారం సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున (28 నవంబర్)అమరింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో సేవలను ప్రారంభించారు. మొదటి దశలోనే 30 కిలోమీటర్ల పొడవున 24 స్టేషన్లతో ఉన్న మియాపూర్ నుంచి నాగోల్ మెట్రో మార్గానికి ప్రధాని పచ్చజెండా ఊపారు.

మన దేశంలో ఢిల్లీ తరువాత స్థానంలో పిపిపి మోడ్‌లో అతి పెద్ద మెట్రో రైల్ వ్యవస్థ హైదరాబాద్ మెట్రో. ఈ రెండేళ్ల లో ఇప్పటి వరకూ 125 మిలియన్ల మంది ప్రయాణికులు మెట్రో లో ప్రయాణించారు. ఈ వ్యవస్థతో 99.8 శాతం మంది ప్రయాణీకుల సంతృప్తి చెందుతున్నారని రకార్డులు చెబుతున్నాయి. దీంతో ఈ మెట్రో మార్గం ప్రపంచంలోనే నంబర్ వన్ మెట్రోగా ఎంపిక కావడమే కాకుండా అధిక స్కోరును కూడా సాధించింది.

గడిచిన రెండేళ్లలో మెట్రో మార్గం ఎల్బీనగర్, హైటెక్ సిటీలకు విస్తరించిన తరువాత రోజుకు 1.51 లక్షల నుండి 3.51 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

మరోవైపు హైటెక్ సిటీ నుండి రాయదుర్గం వరకు మెట్రో మార్గాన్ని త్వరలో ప్రారంభించే సన్నాహాల్లో హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ఉన్నారు. అలాగే జూబ్లీ బస్ స్టేషన్ (జెబీఎస్) నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య నిర్మించిన మెట్రో మార్గం కూడా ఈ ఏడాది చివరినాటికి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ వార్తను ఆంగ్లంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories