చావులోనూ వీడిపోని తోటికోడళ్ల బంధం...

చావులోనూ వీడిపోని తోటికోడళ్ల బంధం...
x
Highlights

సాధారణంగా చాలా ఇండ్లల్లో తోటికోడల్లు ప్రతి విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. బయటికి బాగున్నట్లు నటించినా లోపల మాత్రం ఏదో ఆలోచనతోనే ఉంటారు.

సాధారణంగా చాలా ఇండ్లల్లో తోటికోడల్లు ప్రతి విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. బయటికి బాగున్నట్లు నటించినా లోపల మాత్రం ఏదో ఆలోచనతోనే ఉంటారు. కానీ ఈ తోటి కోడల్లు మాత్రం అక్కాచెల్లెల్ల కంటేఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్నారని చెప్పుకోవాలి. అందుకే కాబోలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. తన తోటికోడలు చనిపోయిందనే బాధలో ఆమె మృతదేహంపై పడి మరో తోటికోడలు కూడా తనువు చాలించింది. ఇది చూసిన స్ధానికులు కంటతడిని జీర్ణించుకోలేకపోయారు.

పూర్తివివరాల్లోకెళ్తే ఈ విషాదకర సంఘటన కూసుమంచి మండలం గంగబండతండాలో మంగళవారం చోటుచేసుకుంది. గంగబండతండాకు చెందిన వడ్త్యి సోనా(52) గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెకు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా తెలిపారు. దీంతో వారు ఆమెకు ఖమ్మం తీసుకెళ్లి ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించి సోమవారం రాత్రి మృతిచెందింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె తోటికోడలు వడ్త్యి సక్రి(45) హుటాహుటిన మంగళవారం ఉదయం లోక్యాతండాలో నుంచి గంగబండతండాకు చేరుకుంది. తన తోటికోడలు చనిపోయిందనే దు:ఖాన్ని దిగమింగుకోలేక సోనా మృతదేహంపై పడి సక్రి విలపించింది. అలా విలపించిన సక్రి ఎంతకీ సోనా మృత దేహంపై నుంచి లేవకపోవడంతో అక్కకున్న వారు ఆమెను లేపే ప్రయత్నంచేసారు. అయినప్పటికీ ఆమె లేవకపోవడంతో వెంటనే ఆటోలో కూసుమంచిలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఖమ్మం వైద్యులు ఆమెను పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. తోటికోడల్లు ఇద్దరు మృతి చెందడంతో గంగబండతండా, లోక్యాతండాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories