పదికి పైగా రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలు సీజ్‌

పదికి పైగా రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలు సీజ్‌
x
Highlights

ఈ మధ్య కాలంలో నూతన వాహనాల కొనుగోలు పెరిగిపోతుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే వాహనాలు కొన్ని వారం రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో నూతన వాహనాల కొనుగోలు పెరిగిపోతుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే వాహనాలు కొన్ని వారం రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మిగిలినా వారందరూ సమయం ఉప్పుడు చేపించుకుందాం లే అన్నట్టుగా వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడిపిస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఎన్ని సార్లు జరిమానా విధించినప్పటికీ వారు మారకుండా రిజిస్ట్రేషన్ లేకుండానే అతి వేగంగా వాహనాలను నడిపిస్తున్నారు. దీంతో పట్టణ ట్రాఫిక్ అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు.

ఏది ఏమైనా రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలను సీజ్ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున నగరంలోని వాహనాల తనిఖీని నిర్వహించారు. వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తూ పూర్తి పత్రాలను చూపించాలంటూ తెలిపారు. కాగా వాహనదారులు కొంత మంది పత్రాలను చూపించి వెల్లగా అందులో కొంత మంది సరైన ధృవపత్రాలను చూపించలేకపోయారు. దాంతో సుమారుగా పదికి పైగా రిజిస్ట్రేషన్‌ కాని వాహనాలను సీజ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీవో అధికారులు, పోలీసులు మాట్లాడుతూ వాహనాలు కొన్నప్పుడు విధిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని, లేదంటే చలానా విధిస్తామని సూచించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories