విషాదం వెంట విషాదం..

విషాదం వెంట విషాదం..
x
Highlights

మృత దేహాన్ని స్వగ్రామానికి తరలిస్తూ వారు కుడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిన హృదయ విదారక సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

మృత దేహాన్ని స్వగ్రామానికి తరలిస్తూ వారు కుడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిన హృదయ విదారక సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. అంబులెన్స్‌లో తమకు సంబందించిన వారి మృత దేహాన్నితరలిస్తున్నారు. ఇదే సమయంలో డీసీఎం వ్యాను ఎదురగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకెళితే సిద్దిపేట మండలం బక్రిచెప్యాల వద్ద రాజీవ్ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న అంబులెన్స్‌, డీసీఎం ఢీకొన్నాయి. దీంతో తుర్కపల్లికి చెందిన రాణి(40), గజ్వేల్‌కు చెందిన సునీత(35)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదం తెల్లవారు జామున జరగడంతో రాజీవ్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. డీసీఎం వేగానికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీరితో పాటు అంబులెన్స్‌లో ఉన్న మృత దేహం కూడా బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులకు హుటా హుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. డీసీఎం డ్రైవర్ అతి వేగం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెపుతున్నారు. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories