పైకి స్వీట్లు.. కింద నోట్లు..

పైకి స్వీట్లు.. కింద నోట్లు..
x
Highlights

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టున్నారు. స్వీట్ బాక్స్ లో సుమారు మూడున్నర లక్షల విలువైన...

శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టున్నారు. స్వీట్ బాక్స్ లో సుమారు మూడున్నర లక్షల విలువైన విదేశీ కరెన్సీని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులు, దుబాయ్ నుంచి విదేశీ కరెన్సీ తెచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ఇండిగో ప్లైట్ లో వచ్చిన ఇద్దరు ప్రయాణీకులు విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. స్వీట్ బాక్స్ లోపల స్వీట్స్ అడుగున కరెన్సీ నోట్లను సీక్రెట్ గా దాస్తే, ఎవరు గుర్తించలేరని భావించారు. అయితే, నిందితులు తీసుకొచ్చిన బిస్కెట్లు, స్వీట్ బాక్స్ లను తనిఖీ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో స్వీట్ బాక్స్ లోని స్వీట్లను తీసేసి, బాక్స్ అడుగు బాగాన్ని చెక్ చేయడంతో అందులో విదేశీ కరెన్సీని గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో కోటిన్నర వరకు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు వారిని విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories