Top
logo

పెళ్లిలో వధువు ట్విస్ట్... వరుడికి షాక్...

పెళ్లిలో వధువు ట్విస్ట్... వరుడికి షాక్...ప్రతీకాత్మక చిత్రం
Highlights

వారం రోజుల నుంచి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పెళ్లి సమయం దగ్గర పడింది. బంధువులతో పెళ్లి పందిరి కిటకిట లాడుతుంది. పీటలపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూర్చున్నారు.

వారం రోజుల నుంచి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. పెళ్లి సమయం దగ్గర పడింది. బంధువులతో పెళ్లి పందిరి కిటకిట లాడుతుంది. పీటలపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూర్చున్నారు. వేదమంత్రాల మధ్య పెళ్లి తంతు నడుస్తుంది. పెళ్లిలో జరిగే ముఖ్యమైన ఘట్టం తలమీద జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం ఆసన్నమయింది. సరిగ్గా అదే సమయానికి పెల్లిలో జరిగినట్టుగానే ఒక్ ట్విస్ట్ జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులకు, వరుడికి పెళ్లి కూతురు ఒక్క సారిగా షాక్ ఇచ్చింది. దీంతో అక్కడున్న వారందరూ నోరు వెల్లబెట్టి చూసారు. అసుల అక్కడ ఏం జరిగిందే తెలుసుకుందాం.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పామాపురం గ్రామానికి చెందిన నందినికి అదే మండలం చర్లపల్లికి గ్రామానికి చెందిన వెంకటేశ్‌లకు పెద్దలు వివాహం నిశ్చయించారు. నిశ్చయించనట్టుగానే శుక్రవారం అందరూ పెల్లి మండపానికి వెల్లారు. ఉదయం 8.10 గంలకు ముహూర్తం ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. అందరి సమక్షంలో పెళ్లి తంతు జరుగుతుండగానే సరిగ్గా తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. దీంతో అక్కడున్న వారందరూ ఒక్క సారిగా నిర్ఘాంత పోయారు.

అసలు విషయం ఏంటో అని తెలుసుకొగా వధువు, ఆమె మేనబావ ఇధ్దరూ కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని వధువు తెలిపింది. దీంతో పెళ్లి మండపంలో పెద్ద రసాభాస నెలకొంది. అంతే కాదు ఈ వివాహానికి నిరాకరించడంతో వరుడి బంధువులు వధువు మేనబావపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న కొంత మంది పెద్ద మనుషులు పోలీసులకు సమాచారం అందించడా వారు సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు.

Web Titletwist in the wedding bride says no to Marriage in wanaparthy District
Next Story


లైవ్ టీవి