Top
logo

మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్

మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్
X
Highlights

మెదక్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల అదృశ్యం మిస్టరీ వీడింది. తండ్రే పిల్లలను తీసుకెళ్లాడు. ...

మెదక్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల అదృశ్యం మిస్టరీ వీడింది. తండ్రే పిల్లలను తీసుకెళ్లాడు. రాజస్థాన్ కు చెందిన జాకీర్ దంపతులు తుప్రాన్ లో ఉంటున్నారు. కొంత కాలం క్రితం భార్యతో గొడవ పడి జాకీర్ రాజస్థాన్ వెళ్లి పోయాడు.

నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్న నస్రీన్ ఓ సీడ్ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. నస్రీన్ ఇంట్లో లేని సమయంలో నలుగురు పిల్లలు అదృశ్యం కావడంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పిల్లలను తానే తీసుకు వెళ్లినట్లు తండ్రి జాకీర్ తెలిపాడు.

Web TitleTwist in a missing mystery, read this story
Next Story